విదేశీ పర్యటనకు బయల్దేరిన కేటీఆర్

Updated By ManamSun, 01/14/2018 - 17:21
Minister KTR, Forigen tour, World Economic Forum Conference
  • ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననున్న కేటీఆర్

  • దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లోనూ పర్యటన

Minister KTR, Forigen tour, World Economic Forum Conferenceహైదరాబాద్: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 23 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా దక్షిణ కొరియా, జపాన్, స్విట్టర్లాండ్‌లో కేటీఆర్ పర్యటించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 22 వరకు దక్షిణ కొరియా, జపాన్‌ను సందర్శించి, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఎంఎన్‌సీ‌ల నుంచి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా పారిశ్రామిక పార్కులను కేటీఆర్ సందర్శించనున్నట్టు సమాచారం. 

English Title
KTR to go forigen tour from today


Related News