‘భరత్ అనే నేను’పై కేటీఆర్ ప్రశంసలు

Updated By ManamWed, 04/25/2018 - 16:22
Bharath Ane Nenu

Bharath Ane Nenu మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని చూసిన మంత్రి కేటీఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, హీరో మహేశ్ బాబు, నిర్మాతను దానయ్యను కలిసిన కేటీఆర్ వారిని అభినందించారు. 

ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన కేటీఆర్.. ‘‘స్నేహితుడు మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివను కలిశాను. భరత్ అనే నేను మూవీ నాకు బాగా నచ్చింది’’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా మరోవైపు ఈ మూవీపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ టీం మంచి విజయాన్ని సొంతం చేసుకుందని అభినందనలు కురిపిస్తున్నారు.

ఫొటోల కోసం క్లిక్ చేయండి

 

English Title
KTR praises on Bharath Ane Nenu team
Related News