ఉత్తమ్‌కు కేటీఆర్ ఘాటైన పంచ్..

Updated By ManamSat, 09/22/2018 - 21:05
KTR, Uttam Kumar reddy, TRS, Congress party 

KTR, Uttam Kumar reddy, TRS, Congress party హైదరాబాద్: టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో పంచులు విసిరారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఉత్తమ్‌పై ట్వీట్లతో విమర్శనాస్త్రాలను సంధించారు. రాహుల్ గాంధీకి అన్ని పళ్లెంలో నుంచి వచ్చాయని.. 8 ఏళ్లుగా తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మంత్రిని అయ్యానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని చెప్పడం.. బ్రిటీషర్లు ఇండియాకు స్వాతంత్య్రం ఇచ్చారు అని చెప్పడంలా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

English Title
KTR Punches to Uttam Kumar Reddy 
Related News