ఆంధ్రా పార్టీకాదు...అందరి పార్టీ

Updated By ManamSat, 09/08/2018 - 17:26
l ramana
l ramana

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు.  టీడీపీ ఆంధ్రుల పార్టీ అన్న కేసీఆర్... గతంలో టీడీపీ ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.  

టీడీపీ ఆంధ్రా పార్టీ కాదని అందరి పార్టీ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ హైదరాబాద్‌లోనే ఉందని అన్నారు. తెలంగాణలో అప్పులు ఎలా పెరిగాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఖాయం అని ఎల్ రమణ వ్యాఖ్యానించారు. 

కాగా తెలంగాణలో  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాదులోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పొత్తులపైనే చర్చ జరిగింది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో చంద్రబాబు...పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

English Title
L ramana condemns KCR comments on TDP Andhra party
Related News