కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు

Updated By ManamTue, 09/11/2018 - 01:20
congress
  • టీఆర్‌ఎస్ అసంతృప్తులే అధికం.. ఆజాద్ సమక్షంలో చేరిక!

congressహైదరాబాద్: రాష్త్రంలో  ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పొత్తుల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్  అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో అసంతృప్తి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. చేరికల విషయంలో  నిర్ణయం తీసుకునేందుకు  పీసీసీ నియమించిన సంప్రదింపుల కమిటీ చేరికల విషయంలో ఆయా నియోజక వర్గాలు, జిల్లాల నాయకులతో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇలా చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా చేరాలనుకునే వారి విషయంలో కొన్ని నియోజకవర్గాల్లోని కొంత మంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 12వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ వస్తున్నారు. రఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ఆయన మీడియాతో మాట్లాడతారు.  ఆజాద్ సమక్షంలోనే టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరనున్న ట్టు సమాచారం. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖా, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళి, నిజామాబాద్‌కు చెందిన మరో టీఆర్‌ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరి చేరికకు సంప్రదింపుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీరితో పాటు త్వరలోనే ఆదిలాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, నందీశ్వర్ గౌడ్, ఆకుల రాజేందర్ వంటి నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేఎస్ రత్నం చేరికను మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నందీశ్వర్ గౌడ్ చేరికను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా వ్యతిరేకిస్తున్నారు. ఈ నాయకులను సంప్రదింపుల కమిటీ నచ్చచెబుతోంది. చేవేళ్ల నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడి నుంచి కేఎస్ రత్నంను పోటీకి నిలిపే అవకాశం ఉంది. ఈ విషయంలోనే సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తితో ఉన్నా రు. వీరితో పాటు నల్లగొండ జిల్లా జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఇబ్రహీంపట్నంకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో కండువా కప్పుకోనున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు బండారు లకా్ష్మరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నియోజక వర్గంలో పొత్తుల్లో భాగంగా టీడీిపీకి ఇస్తారన్న అనుమానంతోనే ఆయన పార్టీ మారుతున్నట్టు సమాచారం.

దానం కలిస్తే తప్పేంటి: ఉత్తమ్ 
ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్‌లో  చేరనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌తో ఆయన భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. దీనిపై ఉత్తమ్‌ను విలేకరులు ప్రశ్నించినప్పుడు .. ఆయన స్పందిస్తూ దానం తనను కలవలేదని, ఒకవేళ కలిస్తే తప్పేంటని జవాబిచ్చారు. కాగా కాంగ్రెస్‌లో చేరేందుకు దానంకు ఉత్తమ్ నో చెప్పినట్టు తెలిసింది. తిరిగి చేర్చుకునే అంశం తన పరిధిలోలేదని స్పష్టం చేసినట్టు సమాచారం.

Tags
English Title
Leaders who are queuing into the Congress
Related News