ఆధిక్యంపై టీమిండియా గురి

Updated By ManamWed, 10/24/2018 - 01:02
Indians cricketers
  • నేడు వెస్టిండీస్‌తో రెండో వన్డే 

  • మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Indians cricketersవిశాఖపట్నం: టాపార్డర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారమిక్కడ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో అతి వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన వాడవుతాడు. అంతేకాకుండా ఈ విషయంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టేస్తాడు. కోహ్లీ ఈ రికార్డును సాధిస్తాడని పోర్ట్ సిటీ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘనతను సాధించేందుకు టెండూ ల్కర్ 259 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అయితే కోహ్లీ 204వ ఇన్నింగ్స్‌లోనే సాధించే అవకాశముంది. భారత బౌలర్లు అంతగా రాణించలేకపోయిన తొలి వన్డేలో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. గువహాటిలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్ ఉత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. చాలా వేగంగా సెంచరీలు సాధించా రు. దీంతో మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా లక్ష్యాన్ని చేరుకుంది. వెస్టిండీస్ జట్టు మానసికంగా క్రుంగిపో యింది. తొలి వన్డేలో సునాయాస విజయం సాధించినప్పటికీ ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో పొదుపైన బౌలింగ్ చేసేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు. 

టీమిండియా టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించడంతో వెస్టిండీస్ బౌలింగ్ అటాక్‌పై మిడిలార్డర్‌ను పరీక్షించుకునేందుకు టీమిండియాకు తగిన అవకాశం రాలేదు. అయితే వరల్డ్ కప్‌కు సిద్ధపాటులో భాగంగా మిడిలార్డర్‌కు తగినంత సమయం ఇవ్వలేకపోవడం జట్టుపై ప్రభావం చూసే అవకాశముంది. ఇక విశాఖ వన్డే విషయానికొస్తే.. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని కోహ్లీ కూడా తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించుకోవాలని వెస్టిండీస్ కూడా భావిస్తోంది. నమ్మకమైన బౌలర్ భువనేశ్వర్ కుమార్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో తొలి వన్డేలో భారత బౌలర్లు ఆశించిన మేరకు బౌలింగ్ చేయలేకపోయారు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో రవీంద్ర జడేజా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టలేకపోయాడు. దీంతో విండీస్ బ్యాట్స్‌మెన్ తమకు నచ్చిన షాట్లు కొట్టారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌తో మళ్లీ వన్డే జట్టులోకి వచ్చిన జడేజా మిగతా మ్యాచ్‌ల్లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ జడేజా ఆల్ రౌండ్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతడిని జట్టులో కొనసాగించే అవకాశముంది. ఇక మహ్మద్ షమీ తొలి వన్డేలో మొండిగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చాడు. అయినప్పటికీ కోహ్లీ అతడినే కొనసాగించాడు. వెస్టిండీ స్‌తో రెండో టెస్టులో 10 వికెట్ల ఘనత సాధించిన ఉమేష్ యాదవ్ రెడ్ బాల్ ప్రతిభను ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. అనేక పరుగులు సమర్పించుకున్నాడు. 

ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్ల బృందాన్ని తయారు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలో ఉమేష్‌కు కూడా ఈ మ్యాచ్‌లో చోటు దక్కే అవకాశ ముంది. అయితే ఈ మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో ఆడలేకపోయిన చినమన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌ను ఈ మ్యాచ్‌కు ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆడించే అవకాశముంది. తొలి వన్డేలో భారత్ బౌలర్లను ఓ ఆటాడుకున్న షిమ్రన్ హెట్మేయర్‌ను కట్టడి చేసేందుకు కుల్‌దీప్‌ను బరిలోకి దించనున్నారు. విండీస్‌కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన కీరాన్ పోవెల్ తర్వాత హెట్మేయర్ ఇన్నింగ్స్ పర్యాటక జట్టుకు బలన్నిచ్చింది. వీరిద్దరిపైనే కాకుండా ఇతర బ్యాట్స్ మెన్‌పై కూడా ఈ రెండో వన్డేలో విండీస్ ఆశలు పెట్టుకుంది. సీనియర్ ప్లేయర్  సామ్యూల్స్ జట్టులో ఉన్నాడు. కానీ సామ్యూల్స్ పరుగుల ఖాతా ప్రారంభించ కుండానే వెనుదిరిగాడు. రెండో వన్డేలో అతను చెలరేగే అవకాశముంది. ధావ న్ కూడా ఏ సమయంలోనే రెచ్చిపోయే అవకాశముంది. ఎందుకంటే 2017 డిసెంబర్‌లో శ్రీలంకతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ధావన్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు. బామ్మ చనిపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమై వన్డే సిరీస్‌కు జట్టులో చేరిన కీమర్ రోచ్ తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ రెండో వన్డేలో అతనికి మరో అవకాశం లభించనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో బిషూ, కెప్టెన్ జాసన్ హోల్డ ర్ కూడా సత్తా చాటే అవకాశముంది.

మరో మైలురాయికి చేరువలో కోహ్లీ
టీమిం డియా కెప్టెన్ విరా ట్ కోహ్లీ త్వరితగతిన బ్యాటింగ్ రికార్డులను బద్ద లు కొడుతు న్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన వన్డేల్లో 36వ సెంచరీ చేశాడు. కోహ్లీ 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 140 పరుగులు చేయడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్లతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే విశాఖలో జరగ నున్న రెండో వన్డేలోనూ కోహ్లీ అదే విధంగా ఆడితే దిగ్గజాల రికార్డును బద్దలు కొ ట్టే అవకాశముంది. వన్డేల్లో కోహ్లీ 10 వేల పరుగులు పూర్తి చేయడానికి మరో 81 ప రుగులు దూరంలో ఉన్నాడు. ఆ పరుగులు సాధిస్తే తక్కువ ఇన్నింగ్స్‌లో 10 వేల ప రుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు 259 ఇన్నింగ్స్‌లతో సచిన్ పేరు మీద ఉంది. కానీ ఆ రికార్డును కోహ్లీ 204 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించే అవకాశముంది. అదే గనుక జరిగితే వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన భారత నాలుగవ క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ ఏడాది కోహ్లీ వన్డేల్లో 889 పరుగులు సాధించాడు. ఈ ఏడాది అ త్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలవకపోవచ్చు. కానీ ఈ పరుగులను కోహ్లీ కేవలం 10 మ్యాచ్‌ల్లో సాధించాడు.

English Title
Leading the team on the lead
Related News