తెలుగు రాష్ట్రాలకు లివ్ ఫాస్ట్

LivFast

హైదరాబాద్: పవర్ బ్యాకప్ సొల్యూషన్స్‌లో విసృత శ్రేణి పోర్ట్‌ఫోలియో, భారత్‌లో అగ్రగామి సంస్థలో ఒకటైన  లివ్ ఫాస్ట్ సంస్థ బ్యాటరీ, ఇన్వర్టర్ ఉత్పత్తుల రంగాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విస్తరించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లివ్ ఫాస్ట్ సంస్థ సీఈఓ గురుప్రీత్ భాటియా అధికారికంగా ప్రకటించారు. శనివారం నుంచి తమ ఉత్పత్తులు రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో అందుబాటులో ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఏఆర్ గ్రూపునకు చెందిన లివ్ ఫాస్ట్ ప్రధానంగా వాహనాల బ్యాటరీలు, ఇన్వర్టర్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు సోలార్ అప్లికేషన్స్ వంటి విభాగాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన ఈ కంపెనీ 2015లో అటోమోటివ్ రంగానికి విస్తరించింది. కాగా, బ్యాటరీ విభాగాలకు 2016లో ప్రవేశించిన లివ్ ఫాస్ట్ గత నెలలో దక్షిణాదిన కర్ణాటకలో ప్రవేశించింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో తన ఉనికి విస్తరించుకుంది. రూ. 1,000 కోట్ల విలువ కలిగిన కంపెనీ కేవలం గృహ బ్యాటరీల విభాగానికే రూ. 250 కోట్లను వెచ్చించినట్లు సీఈఓ గురుప్రీత్ పేర్కొన్నారు. కాగా, బ్యాటరీల ఉత్పత్తికి గాను హిమాచల్, బద్ది ప్రాంతాల్లో ప్లాంటు ఉన్నాయని తెలిపారు. వీటి సామర్థ్యం ఏడాదికి 18 లక్షల యూనిట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా, దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనాలు, ఈ-రిక్షాలపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 12 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేస్తామని ఆయన ఆశించారు. ఈ విభాగానికి ప్రముఖ క్రికెటర్ ఎం.ఎస్. ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. 

Tags

సంబంధిత వార్తలు