274పరుగులతో ముగించిన టీమిండియా

Updated By ManamTue, 02/13/2018 - 20:41
virat

viratపోర్ట్ ఎలిజిబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5వ వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ 115 పరుగులతో సెంచరీ చేసి రాణించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ 34 పరుగులు చేశాడు. 8 ఫోర్లు చేసి దూకుడుగా ఆడుతున్న ధావన్‌ను రబడ ఔట్ చేశాడు. ధావన్ ఔట్ తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ 36పరుగులు చేశాడు. డుమ్నీ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. రహానే కూడా రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, ధోనీ కూడా దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎన్‌గిడి ధాటికి ఔట్ కాక తప్పలేదు. హార్థిక్ పాండ్యా డకౌట్ అవడం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్ ముగిసే సమయానికి భువనేశ్వర్ కుమార్(19), కుల్‌దీప్ యాదవ్(2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

English Title
Live score updates India vs South Africa, 5th ODI: India set 275-run target for South Africa
Related News