భార్యాభర్తల లైవ్ సెక్స్ స్ట్రీమింగ్

Updated By ManamSun, 04/01/2018 - 18:22
live web cam sex streaming culture at high in bengaluru
  • గంటకు 3 వేలు.. ఐడెంటిటీ తెలియకుండా మొహాలకు మాస్కులతో లైవ్ శృంగారం 

  • ఆ జంట ఒక్కటే కాదు.. బెంగళూరులో పెరిగిపోతున్న వెబ్ కాం సెక్స్ స్ట్రీమింగ్ కల్చర్

live web cam sex streaming culture at high in bengaluru

బెంగళూరు: వారిద్దరికీ పెళ్లయి మూడేళ్లు. లైంగిక దాంపత్యం అంతా సాఫీగానే సాగుతోంది. ఆ ఉల్లాసాన్ని మరింత పొందాలని భావించిన ఆ జంట ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. అదే.. ‘లైవ్ సెక్స్ స్ట్రీమింగ్’!! అవును.. బెంగళూరుకు చెందిన ఈ జంట తమ శృంగారాన్ని లైవ్‌లో వేరే వాళ్లకు చూపించే పని పెట్టుకుంది. ఉద్యోగంలో మంచి సంపాదనే వస్తున్నప్పటికీ.. ఇలా ఓ కొత్త ఆదాయ వనరును సృష్టించుకుంది ఆ జంట. అలా అలా వారి శృంగారానికి లైవ్ స్ట్రీమింగ్‌లో పాపులారిటీ రావడంతో... దానినే ఓ రకమైన వ్యాపారంగా మలచుకుంది. అలా సెక్స్ లైవ్ స్ట్రీమింగ్‌ను చేసేందుకు గంటకు రూ.3 వేలు చార్జ్ చేస్తుంది ఆమె. ఈ విషయం గురించే ఆ వివాహిత ఆశ్చర్యకర విషయాన్ని చెప్పింది.

‘‘ఇది వింతగానే అనిపించొచ్చు. కానీ, ప్రారంభంలో మేము మా లైవ్ సెక్స్ స్ట్రీమింగ్‌ను కేవలం దంపతులకు, ఒంటరి మహిళలకు మాత్రమే చూపించేవాళ్లం. అప్పుడప్పుడు డీసెంట్‌గా ఉండే కొందరు మగాళ్లకూ లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవాళ్లం. కానీ, ఇప్పుడు డబ్బు కోసం అందరికీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం’’ అని ఆమె చెప్పింది. అయితే, వారి ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు ముఖాలకు మాస్క్‌లు ధరించి లైవ్ స్ట్రీమింగ్ చేస్తోందట ఈ జంట. ఇప్పుడు బెంగళూరులో ఈ ‘లైవ్ సెక్స్ స్ట్రీమింగ్’ సంస్కృతి పెరిగిపోతోంది. 

ఆ జంట ఒక్కటే కాదు...
బెంగళూరులో ఆ జంట ఒక్కటే కాదు.. వేరే వృత్తుల్లో ఉన్న పలువురు యువతులూ అదే పని చేస్తున్నారు. కోల్‌కతా నుంచి వచ్చి బెంగళూరులో బ్యుటీషియన్‌గా చేస్తున్న ఓ యువతి కూడా ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది. అడల్ట్ చాట్ రూంలోకి వెళ్లడమే కాదు.. బట్టలిప్పేసి వారికి నయనానందం పంచుతోంది. ఇక, నోటి నుంచి బూతు మాటలు సరేసరి. ‘‘నేను తరచూ వెబ్‌కాంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటాను. 45 నిముషాలకు రూ.1500 చార్జ్ చేస్తా. నా వాలెట్‌లో డబ్బులు పడిన వెంటనే బట్టలు విప్పేస్తా. వారికి నా శరీరం మొత్తం చూపిస్తా. అంతేకాదు, మసాలా మాటలూ మాట్లాడతా. ఇదంతా కూడా స్కై్ప్, గూగుల్ హ్యాంగౌట్స్ ద్వారా మాత్రమే చేస్తా’’ అని ఆ బ్యుటీషియన్ చెబుతోంది. బెంగళూరులోని హెన్నూర్ బందేకి చెందిన మరో యువతి కొన్ని నెలలుగా దీనినే ప్రవృత్తిగా మార్చుకుంది. మంచి ఉద్యోగంలోనే ఉన్నా.. అందులో ఆనందం ఉందనిపించి అలా చేస్తోందట ఈ అమ్మాయి. ‘‘నేను వ్యభిచారిని కాదు. భవిష్యత్తులో కాబోను. నేనో మంచి ఉద్యోగం చేస్తున్నా. కానీ, ఈ లైవ్ సెక్స్ స్ట్రీమింగ్‌లో ఆనందం ఉందనిపించే అది చేస్తున్నా’’ అని అంటోందామె. వాళ్లే కాదు.. పలువురు ట్రాన్స్‌జెండర్లు, స్వలింగ సంపర్కులూ ఇదే రీతిలో వెళుతున్నారు. 

చట్టం ఒప్పుకొంటుందా..?
భారత చట్టాల ప్రకారం ఇలా లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ చేయడం నేరమే. సెక్స్ కార్యకలాపాలకు సంబంధించి ఏటా 4 వేలకు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదవుతున్నట్టు సైబర్ క్రైమ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అందులో ఒక్కటి కూడా వెబ్ కామ్ లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ కేసులు లేవని అంటున్నారు. ‘‘వాస్తవానికి ఇక్కడ ఇలాంటివి చాలా అరుదు. కానీ, ఎప్పుడైతే ఈ-వాలెట్‌లు వచ్చాయో అప్పటి నుంచే ఈ లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ పుట్టగొడుగుల్లా వ్యాపించేసింది. ఐడెంటిటీని వేరే వాళ్లకు తెలియకుండా కంప్యూటర్ వెనక కూర్చుని వెబ్ కాం ద్వారా డబ్బు సంపాదించడం ఓ సులభ మార్గమైపోయింది. అయితే, ఇప్పుడు ఈ-వాలెట్లకు కేవైసీ కూడా తప్పనిసరి అయినందున ఇలాంటి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’’ అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. 

వ్యసనం..
ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అందివచ్చాక సమస్తం అరచేతిలోనే తెలిసిపోతోంది. దీంతో ఇలాంటి కార్యకలాపాలూ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అయితే, ఇది మరింత ముదిరి వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పోర్నోగ్రఫీకి వారంతా కూడా బానిసలయ్యే ముప్పు భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బెంగళూరులో ఇది విచ్చలవిడిగా ఉన్నప్పటికీ ఎవరూ చికిత్సకు ముందుకు రావట్లేదని, కొందరు తెరమరుగునే ఉండిపోతున్నారని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న షట్ (సర్వీస్ ఫర్ హెల్దీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ) క్లినిక్ మానసిక నిపుణుడు డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ అంటున్నారు.

2013-14లో తాము చేసిన సర్వేలో 18-50 మధ్య వయసున్న పురుషులు, మహిళల్లో పోర్నోగ్రఫీ వ్యసనం భారీగా ఉన్నట్టు తేలిందన్నారు. అయితే, వెబ్‌కాం స్ట్రీమింగ్ అనేది పోర్నోగ్రఫీని మరింత ముదిరేలా చేస్తుందని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు నిజంగా సెక్స్ చేసుకుంటుంటే చూడాలన్న కొందరి అత్యుత్సాహాన్ని చాలా మంది ఇలా క్యాష్ చేసుకుంటున్నారని, అది వ్యసనాన్ని మరో స్థాయికి తీసుకెళుతుందని హెచ్చరిస్తున్నారు.

1996లోనే...
వెబ్‌కాం స్ట్రీమింగ్ ఇప్పటి ట్రెండ్ కాదు. ఎప్పుడో 90వ దశకంలోనే స్టార్ట్ చేసింది జెన్నీఫర్ రింగ్లే అనే మహిళ. 1996లో (అప్పటికి ఆమెకి 19 ఏళ్లు) తన కాలేజీ హాస్టల్ గదిలోనే ఓ వెబ్ కాంను అమర్చేసి ఎప్పటికప్పుడూ తన గురించి లైవ్ అప్‌డేట్స్ ఇస్తుండేది. ప్రతి మూడు నిముషాలకోసారి ఆ కెమెరా తన చిత్రాలను తీసేలా టైమర్‌ను సెట్ చేసి పెట్టేది. ఆమె చేసే ప్రతి పని.. బట్టలు మార్చుకోవడం, సెక్స్ చేయడం, స్వీయ భావప్రాప్తి పొందడం దగ్గర్నుంచి ప్రతిదీ తెలిసిపోయేది. అయితే, 2003లో రింగ్లే తన వెబ్‌సైట్‌ను మూసేసింది. దానినే కొన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది.

ఇక, సీఎన్‌బీసీ అధ్యయనాల ప్రకారం ఏటా ఈ వెబ్ కాం లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ వ్యాపారం వంద కోట్ల డాలర్లను దాటిపోతోందంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ప్రపంచ వ్యా్ప్తంగా దాదాపు 16 కోట్ల మంది ఈ వెబ్ కాం లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తేలింది. ఇక, ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేసే లైవ్‌జాస్మిన్ అనే సైట్ ప్రపంచంలోనే 69వ ర్యాంకులో ఉందంట. ఇంటర్నెట్ అనలిటిక్స్ సంస్థ అలెగ్జా ప్రకటించిన ర్యాంకిది. అత్యధికంగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాల నుంచే ఎక్కువగా ఈ వెబ్ కాం లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నట్టు తేలింది. రుమేనియా, సోవియట్ రిపబ్లిక్, తూర్పు ఐరోపా దేశాల నుంచీ గణనీయంగా ఈ వ్యాపారం సాగుతోంది. ఈ విషయంలో భారత్ చాలా చాలా మేలే అయినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ఆ సంస్కృతి కాస్తా పెరిగిపోతోంది. 

English Title
live web cam sex streaming culture at high in bengaluru
Related News