'అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలకూ ఎన్నికలు'

Updated By ManamFri, 06/22/2018 - 20:54
Chandrababu naidu, local elections, Assembly elections, State people

Chandrababu naidu, local elections, Assembly elections, State peopleఅమరావతి: అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా నేతలతో శుక్రవారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నాలుగేళ్లలో్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తలసరి ఆదాయం రెట్టింపు చేశామని గుర్తు చేశారు. మూడేళ్లుగా రెండంకెల వృద్ధిరేటు సాధిస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తున్న టీడీపీకి గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలన్నారు. పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తలంతా రాజకీయ విశ్లేషకులుగా మారాలని సూచించారు.

పార్టీకి ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని రాజకీయ పార్టీలూ టీడీపీపై విషప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ తీరుపై మండిపడిన చంద్రబాబు..  జైలుకు పోకుండా ఉండేందుకే బీజేపీతో జగన్‌ సన్నిహితంగా ఉంటున్నారని విమర్శించారు. ఎన్నికలు రాకుండా చూసుకొని రాజీనామాల పేరుతో వైసీపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

English Title
local elections to be held all at once, says Chandrababu naidu 
Related News