పవన్‌ ఆరోపణలకు లోకేశ్ కౌంటర్

Updated By ManamSat, 06/09/2018 - 18:39
Lokesh babu, Pawan kalyan allegations, Real estate company, Fortune 500,

Lokesh babu, Pawan kalyan allegations, Real estate company, Fortune 500, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. స్థానికులకు కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు టీడీపీ ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్న పవన్ ఆరోపణలను లోకేశ్ ఖండించారు. ‘‘ఫార్చ్యూన్- 500 కంపెనీల్లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఒకటి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు. ఏపీలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉద్యోగాలు ఇవ్వబోతోంది. విశాఖలో టెక్ కంపెనీని ప్రారంభించేందుకు బీటీడబ్ల్యూ పల్సెస్ కంపెనీ కోసం భూమిని కేటాయించారు. ఆ కంపెనీకి సీఈవో శ్రీనుబాబు.. శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కల్పించడానికి ముందుకొచ్చే ప్రతిఒక్కరికి రెడ్ కార్పేట్‌తో స్వాగతం పలుకుతాం. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు వారికి కల్పించి వ్యాపార లక్ష్యాలను సాధించుకునేలా సహకరిస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కాలేదు’’ అని లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English Title
Lokesh babu counter to Pawan kalyan allegations
Related News