జైట్లీ వ్యాఖ్యలు బాధాకరం: లోకేశ్‌

Updated By ManamTue, 04/17/2018 - 18:36
Lokesh babu, Arun Jaitley, AP CM Chandrababu naidu, Cash shortage issue

Lokesh babu, Arun Jaitley, AP CM Chandrababu naidu, Cash shortage issueఅమరావతి: ‘దేశంలో నగదుకు కొరత లేదని, తాత్కాలిక నగదు కొరత ప్రస్తుతం ఉంది’ అని కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని జైట్లీ మాట్లాడటం బాధాకరమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో నగదు కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పరంగా పెన్షన్లు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపులో కూడా తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన ఆయన.. నగదు సరఫరా చేయాలని స్వయంగా సీఎం లేఖ చేశారని, అనేక సార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నగదును అందుబాటులోకి తేవాలని లోకేశ్‌ ట్విట్టర్‌లో జైట్లీని కోరారు.

English Title
Lokesh babu slams Arun Jailtley statements on Cash shortage issue
Related News