ఇక దూకుడే!

Updated By ManamSat, 08/04/2018 - 02:05
babu
  • చంద్రబాబును ఎదుర్కొనేందుకు  షా నాయకత్వంలో వ్యూహం 

  • పోలవరం అవినీతి, భూముల కేటాయింపు.. బినామీల సంగతి తేల్చాలని నిర్ణయం 

  • విమర్శల ఘాటు పెంచుతున్న నేతలు.. కొత్త నేతల చేరికపై భారీగా కసరత్తులు

  • త్వరలో అమిత్ షా పర్యటన ఖరారు.. మూడు ప్రాంతాల్లో మూడు సభలు

imageఅమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా... విభజన హామీలు.. ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్ లాంటి అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని, బీజేపీని రాష్ట్ర ప్రజల ముందు ద్రోహులుగా చూపిస్తున్న ముఖ్య మంత్రి చంద్రబాబును దీటుగా ఎదుర్కొనేందుకు కమలదళం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విషయంలో మెతకవైఖరి అవలంబిస్తున్న బీజేపీ.. ఏపీలో మాత్రం టీడీపీపై సమరానికి సన్నద్ధం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారా యణతో సహా ముఖ్య నేతలందరితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల సమాలోచనలు చేశా రు. వారి అభిప్రాయాలు తెలుసు కున్నారు. ప్రధానమంత్రి నరేం ద్రమోదీ టార్గెట్‌గా చంద్రబాబు ఎలాంటి వ్యూహం అనుసరిస్తు న్నదీ వారు తెలియజెప్పినట్టు సమాచారం. ధర్మపోరాట దీక్షల్లో ప్రధానిపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు, వీడియో ప్రదర్శనల గురించి అమిత్ షా వద్ద కొందరు నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. అమిత్ షా మాత్రం.. జాతీయస్థాయిలో తమ వ్యూహంపై కూడా రేఖామాత్రంగా వారికి సంకేతాలందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో అమిత్ షా ఏపీ టూర్ ఖరారు కానుంది. రాష్ట్రంలో ఉత్త రాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో మూడుచోట్ల బహిరంగ సభలు ఉండవచ్చని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణి అవలంబి స్తున్నారనీ, హోదా వద్దు.. ప్యాకేజీ కావాలని ఒకప్పుడు పట్టబట్టి తీసుకుని ఇపుడు మాటమార్చి తమపై ఎదురుదాడి చేస్తున్నారన్న విష యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్యాకేజి ప్రకటించినపుడు ఎందుకు సంబరాలు చేసుకున్నారు... అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో ఎందుకు సన్మానాలు చేశారు’ అని ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబును నిలదీయా లని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పోలవ రంలో జరిగిన అవినీతి, ప్రైవేటు కంపె నీలకు భూముల ధారాదత్తం, బినామీలపై కూడా పెద్దఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలి సింది. ఈ మేరకు కీలక సమాచారాన్ని సేకరించే పనిని కొంతమందికి అప్పగిం చారంటున్నారు. ఈ నేపథ్యంలో  బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయుకుడు, ఎమ్మెల్సీ సో ము వీర్రాజు చంద్రబాబుపై నిప్పులు చె రిగారు. చంద్రబాబు ప్రభుత్వం నీరు- చెట్టు కార్యక్రమంలో భారీ కుంభకోణానికి పాల్పడిందనీ, మట్టిని తవ్వి తీయటానికి రూ. 13,600 కోట్ల ఖర్చును చూపెట్టటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడును అవి నీతి రాక్షసుడిగా అభివర్ణించిన ఆయన పంచభూతాలు కూడా బాబును క్షమించబోవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చాక కొంతకాలం మౌనంగా ఉన్న వీర్రాజు మళ్ళీ రంగంలోకి దిగి టీడీపీ ప్రభుత్వం అవినీతిని దునుమాడటం వెనుక అధిష్ఠానం ఆదేశాలు ఉన్నట్టు తెలిసింది.

చేరికలపై ప్రత్యేక దృష్టి
బీజేపీలో నాయకుల చేరికలకు అత్యంత ప్రాధాన్యం కల్పించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లాల వారీగా అన్ని పార్టీల్లోని ద్వితీయశ్రేణి నేతలు, వృత్తి నిపుణులు, మేధావులు, తటస్థులను పార్టీలో తీసుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన అన్ని జిల్లాల్లో పర్యటించారు. ప్రతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు రావటం ద్వారా అక్కడ అనుసరించాల్సిన వ్యూహం, నేతల చేరికలపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అమిత్ షా పర్యటన నాటికి పార్టీలో కొత్త జవసత్వాలు వచ్చాయన్న అభిప్రాయం కలిగించేలా ప్రతి జిల్లాలో పార్టీలో చేరికలపై దృష్టి సారించనున్నట్టు తెలిసింది.

English Title
The longer the jump!
Related News