ముంచుకొస్తోంది!

phethai
  • కాకినాడ.. ఒంగోలు మధ్య తీరం దాటే ఫెథాయ్

  • దిశ మారితే బందరు -  నెల్లూరు మధ్య..

  • పెను తుపానుగా మారేందుకు అవకాశాలు

  • గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదలిక

  • దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

  • ఓడ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • అనుక్షణం గమనిస్తున్న ఆర్టీజీఎస్ విభాగం

  • కళ్లాల్లోనే ధాన్యం.. అన్నదాతలలో దైన్యం

అమరావతి/శ్రీకాకుళం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘ఫెథాయ్’ తుపానుగా మారింది. శుక్రవారం సాయంత్రానికి మచిలీపట్నానికి ఆగ్నే యంగా 1090 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలోను ఇది ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారుతుందని, ఆ తర్వాతి 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మధ్యా హ్నం రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకి నాడ... ప్రకాశం జిల్లా ఒంగోలు మధ్య ఎక్కడైనా తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించా రు. తుపాను ఫలితంగా దక్షిణ కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ సంస్థకు చెందిన ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త మహేశ్ పలావత్ తెలిపారు. తీరం దాటిన తర్వాత గాలుల ప్రభావం తగ్గనుంది. ఒక వేళ తుపాను దిశ మార్చుకుంటే దక్షిణకోస్తా వైపు వెళ్లి... మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ, ఇస్రో, నాసా ఈ తుపానుపై ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న బులెటిన్లను పరిశీలిస్తున్న అధికారులు దీని కదలికలపై ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పలు ఓడ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.  

16 కిలోమీటర్ల వేగంతో..
17వ తేదీ సాయంత్రానికి తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) తెలిపింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్న తుపాను గమనాన్ని ఆర్‌టీజీఎస్ నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆర్‌టీజీఎస్‌లో తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ అవుతున్నాయి. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మత్స్యకారుల పడవలు తీరంలోనే నిలిచిపోయాయి. 

యంత్రాంగం సర్వసన్నద్ధం
పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణనష్టం లేకుండా చూసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం  సిద్ధమౌతోంది. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా, దాని ప్రభావం కృష్ణా జిల్లాపై  ఉండే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే  ఆయా జిల్లాల కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. టెలికాన్ఫరెన్సులు నిర్వహించి మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫెథాయ్ తుపాను ప్రభావంతో వచ్చే భారీ వర్షాల వల్ల అపార నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కోరారు. తుపాను ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉండవచ్చోనన్న అంశంపై అంచనా వేశారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నిత్యావ సర సరుకులు, ఇతర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పునరావాస శిబిరాల నిర్వహ ణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

రైతుల తీవ్ర ఆందోళన
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కళ్లాల్లో ధాన్యం ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు వెంటనే ప్రభుత్వ సహాయం తీసుకుని కళ్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికా రులు సూచిస్తున్నారు. రహదారులపై పలు ప్రాంతాల్లో ధాన్యం ఆరబోశారు. తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని కాకినాడ, యు.కొత్తపల్లి, కాట్రేని కోన, అంతర్వేది ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్ర తీరప్రాం తాల్లో అలలు ఆరుమీటర్ల ఎత్తు వరకూ లేచి పడే అవకాశాలుండటం వల్ల మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంత మండలాల అధికారులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

జిల్లాల్లో అధికారులు అప్రమత్తం
తుపాను పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అమలా పురం ఆర్డీఓ కార్యలయం వద్ద తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తుపాను జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని కానీ అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదని అన్నారు. ముందజాగ్రత్తగా కోనసీమలో 27 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తిత్లీ తుపాను లో పని చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను  ప్రత్యేకంగా నియమిస్తు న్నామని, ప్రజలకు కావల్సిన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచా మని చెప్పారు. కమ్యూనికేషన్ నిలిచిపోకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళ వారం సెలవు దినాలుగా ప్రకటించారు. ఫెథాయ్ తుపానును ఎదుర్కోవడానికి జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలలో ఏడు పునరావాస కేంద్రాలలు.  ఉప్పలగుప్తం మండలంలో వాసాలతిప్ప, చల్లపల్లి, ఎన్. కొత్తపల్లి, ఎస్. యానాంలోని పాఠశాలలు, అల్లవరం మండలంలో ఓడలరేవు సైక్లోన్ షెల్టర్లు, సామంతకుర్రు సైక్లోన్ షెల్టర్లుతో పాటు కొమరిగిరిపట్నం సైక్లోన్ షెల్టర్లను సిద్ధం చేశారు. 

చంద్రబాబు సమీక్ష
‘పెథాయ్’ తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రయంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాల్లో తుపాను ముందస్తు సన్నద్ధతలపై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారిం చి యంత్రాంగంతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తీవ్ర వాయుగుండం శనివారం మధ్యాహ్నం తుపానుగా మారిందని అధికారులు సీఎంకు వివ రించారు. మార్పులను అనుక్షణం గమనించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. ఆర్టీజీఎస్‌లో తుపాను పరిస్థితి ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేయాలని, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకునిరంతరం హెచ్చరికలుపంపాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

Tags

సంబంధిత వార్తలు