
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడిని సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా బుధవారం ఒక్కరోజే 65,350 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,251 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం బుధవారం రూ. 3.71 కోట్లుగా ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.
English Title
Lord Venkanna devotees information