తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Updated By ManamTue, 02/06/2018 - 09:12
lord venkateswara

lord venkateswara devotees informationతిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, అలాగే నడకదారిన వచ్చేవారికి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పట్టనుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా సోమవారం 65,813 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. సోమవారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.44 కోట్లు. 24,662 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

ఇదిలా ఉంటే.. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

English Title
lord venkateswara devotees information
Related News