సర్వం ప్రేమమయం

Updated By ManamWed, 02/14/2018 - 00:04
image

love is loveప్రేమికుల దినోత్సవం సందర్భంగా కృత్రిమ అలం కరణలు, కానుకలతో కోట్లాది రూపాయల వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా వర్దిల్లడానికి సదా సిద్ధమైంది.  ప్రేమికుల పేరుతో ఇచ్చి పుచ్చుకొనే బహుమతులకు మతి పోగొట్టే అలంకరణతో, రంగుల హరివిల్లులతో జేబులు గుల్ల చేయడానికి ఆన్‌లైన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రేమను వ్యక్తపరచడానికి ఖరీదైన, ఖరీదుకాని బహుమతులు, కానుకలు అనివార్యమా? ప్రేమను ఖరీదుతో వెలకట్టడం సాధ్యమేనా? ఆధునిక యువకుల ఆలోచనాధోరణి ఏమి చెబుతున్నది. జగత్తు అంతా ప్రేమతో నిండి ఉన్నది. సృష్టి సర్వం ప్రేమమయం. కర్షకుడు మట్టిని ప్రేమించకపోతే మానవునికి అన్నం దొరుకు తుందా? పిబ్రవరి 14 ఒక్క రోజేమిటి సర్వం ప్రేమైక జీవితం. పంచభూతాలు మానవాళికి అండగా నిలువకపోతే భవిష్యత్తు అంధకారం కాదా? తల్లి బిడ్డను ప్రేమించకపోతే మానవ మను గడ ఉంటుందా? మానవుడు తనదైన వృత్తులను ప్రేమిస్తూ, సహవాసం చేస్తూ సమాజానికి చేదోడు వాదోడుగా నిలబడక పోతే సమాజం ముందుకు సాగుతుందా? సరిహద్దుల్లో ఎము కలు కొరికే చలిలో తన ప్రాణాలను పణంగాపెట్టి నిత్యం పహా రా కాసే సైనికులు తమ వృత్తిని ప్రేమించకపోతే అశాంతి చెల రేగే ఆస్కారం ఉండదా? సైనికుల త్యాగాల పునాదులపైననే దేశం శాంతికాముకంగా నిలబడుతున్నది నిజంకాదా? దేశంలో, పట్టణాల్లో, గ్రామాల్లో పారిశుధ్యపరంగా సమున్నతంగా సమా జాన్ని నిలబెట్టాలని పరితపించే పారిశుధ్యకార్మికుడు తన వృత్తిని ప్రేమించకపోతే వీధులన్నీ మురికికూపాలుగా మారే అవకాశం ఉండదా? కఠోర శ్రమతో, అకుంఠిత దీక్షతో లక్ష్యాన్ని ప్రేమించకపోతే ఆశయం నెరవేరుతుందా? ఇలా చెప్పుకుంటే పోతే సమాజం ప్రేమతో సమ్మిళితంగా, సహజత్వంతో భిన్న త్వంలో ఏకత్వాన్ని పెంపొం దిస్తూ ముందుకుసాగుతున్నది. భిన్న మతాలు, భిన్న ఆచారాలు, వైవిధ్యాలు కలిగిన భారతా వనిలో మనిషి మానవత్వాన్ని ప్రేమించకపోతే, మనిషితత్వాన్ని కనబ రచకపోతే కోట్లాది జనావళి నిత్యం సంతోషంగా ఉండగలు గుతారా? ఇలా ప్రేమలు అనునిత్యం అజరామరంగా ఎల్లవేళలా వెలుగొం దుతూ, మనుషుల మధ్య మంచితనాన్ని వెలిగిస్తున్నాయి. లేకపోతే భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టబడుతుంది. ప్రేమికుల రోజుతో ప్రేమికులను గుల్లచేసే వ్యాపార ధోరణికి ముకుతాడు వేయకపోతే మార్కెట్ సంసృ్కతిలోకి నెట్టబడి మానవ సంసృ్కతి, భారతీయ సంసృ్కతి కనమరుగు కానుంది. సమస్త జీవరాశి మనుగడకు ఆధార భూతమైన నింగి, నేల, నీరు, గాలి నిప్పు సృష్టిపై ఆగ్రహిస్తే దిక్కేమిటి? ప్రకృతిని ప్రేమించండి. మనుషుల మధ్య ప్రేమలు సహజమే కానీ లోక వైభోగానికి, లోక కళ్యాణానికి అండగా నిలిచే ప్రకృతి సంపద పట్ల ప్రేమను పంచండి, ప్రకృతి సంపదను పరిరక్షించండి. విదేశీమోజులో చిత్తవుతున్న యువత కృత్రిమ అలంకరణలు, కానుకలతో కా లం వెళ్ళదీయకుండా కాలాతీతం కాకుండా జగత్తుకు కారణ భూతమైన కారకాలను ప్రేమించండి. అనునిత్యం ప్రేమించండి, ప్రేమను పొందండి. ప్రేమ అంటే  మనుషుల మధ్య సంబంధం ఒక్కటే కాదు కదా. విజ్ఞానంలో దూసుకుపోతున్నాం, వివేకంతో అందలాలు ఎక్కుతున్నాం, ఖండాంతరాలు కలియ తిరుగుతున్నాం. కానీ మహిమాన్వి తమైన శక్తిగల సహజసంపదను నిర్లక్ష్యం చేస్తున్నాం. మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ దేశాన్ని ప్రేమించండి, ప్రేమను పంచండి. సమస్యలతో సతమత మవుతున్న సాటి జనులకు సాయపడండి. అప్పుడే దేశం స్వచ్చమైన ప్రేమతో స్వచ్చభారతంగా సాక్షాత్కరిస్తుంది. ఆధునిక యుగంలో సాంకే తిక సత్తువతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకులంతా భార తీయ సంసృ్కతి, సంప్రదాయాలను సమున్నతంగా నిలబె ట్టాల్సిన బాధ్యత యువతరైంపె ఉంది. రుధిర ధారలు లేని శాంతికాముక సమాజాన్ని నిర్మించండి. అంతి మంగా విలువలు కలిగిన వ్యక్తిగాఅవతరించండి.
- సంవేదన
హన్మకొండ, జి.వరంగల్(అర్బన్)
(నేడు ప్రేమికుల దినోత్సవం)

English Title
love is love
Related News