రోడ్డు రోలర్‌పై ప్రేమతో...

Updated By ManamFri, 11/09/2018 - 02:02
kutumbam

imageఆమె దగ్గర 10 డ్రైవింగ్ లైసెన్సులున్నాయి.. అంతేకాదు కేరళాలో మొట్టమొదటి మహిళా రోడ్ రోలర్ డ్రైవర్‌గా షినీ వినోద్ సరికొత్త రికార్డు సృష్టించారు. డ్రైవింగ్ అంటే తనకు ప్రాణమని.. అందుకే ఎప్పటికప్పుడు మరిన్ని వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు వాటిని నడిపేందుకు అవసరమైన లైసెన్సులను కూడా సంపాదిస్తున్నారు. 

మోహన్ లాల్ సినిమా..
ఎవరైనా విమానం, క్రూజ్, కారు, బుల్లెట్..ఇలాంటి వాహనాలతో ప్రేమలో పడతారు.. వీటిని డ్రైవ్image చేయాలనుకుంటారు.. కానీ విచిత్రంగా ఆమెకు మాత్రం రోడ్డు రోలర్‌పై కళ్లుపడ్డాయి. అంతే తన ప్రేమకు కాస్త ఆసక్తిని జోడించి, సాహసోపేతమైన అడుగులు వేసి, తన కలను సాకారం చేసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 38 ఏళ్ల షినీ వినోద్ బాల్యంలో మోహన్‌లాల్ సినిమా ‘వెళ్లనకలుడే నాడు’లో రోడ్ రోలర్‌ను చూసినప్పటినుంచీ తనకు రోడ్డు రోలర్‌పై ఆసక్తి పెరిగిందని చెబుతారు. భర్త బిజినెస్ మ్యాన్ కావడంతో తన డ్రైవింగ్ ప్యాషన్‌ను తీర్చుకునేందుకు ఈమెకు ఆర్థిక ఇబ్బందులు లేవు.

imageటూ వీలర్‌తో మొదలు, ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, ట్రాక్టర్లు..ఇంకా ఇప్పుడు రోడ్ రోలర్లు కూడా నడిపేందుకు ఈమెవద్ద లైసెన్సులు ఉండటంతో షైని స్టార్ డ్రైవర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం 12 నెలల ట్రాక్టర్ మెకానిక్ కోర్సు చేస్తున్న ఈమె తన చదువుకు మాత్రం 10వ తరగతి తరువాత ఫుల్‌స్టాప్ పెట్టేసింది. స్కూల్ డేస్‌లో చురుగ్గా ఉంటూ, స్పోర్ట్స్ పట్ల మక్కువ చూపిన షినీ.. షాట్‌పుట్ క్రీడాకారిణిగా రాష్ట్రస్థాయిలో రాణించారు కూడా. ముగ్గురు అక్కచెల్లెళ్లని మగపిల్లలతో సమానంగా తమ తండ్రి పెంచారని, చిన్నప్పుడు ఆయన వాడిన బండితోనే తనకు చక్రాలపైఅంతులేని ప్రేమగా మారిందని ఆమె సగర్వంగా చెబుతారు.

ఇక పెళ్లయ్యాక భర్త కూడా తనలోని ఉత్సాహాన్ని ప్రోత్సహించడంతోనే పలు రకాల వాహనాలు నడపడాన్నిimage వ్యసనంగా పెట్టుకున్నట్టు షినీ చెబుతారు. వారం రోజుల వ్యవధిలోనే ఎక్స్‌కవేటర్ డ్రైవింగ్ నేర్చుకున్నట్టు.. కానీ తనకు హార్వెస్ట్ మెషీన్ నడపడం అంటే ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చే పనిగా వివరిస్తారు. నిజానికి ఇది నడిపేందుకు ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదు కానీ హార్వెస్ట్ మెషీన్‌ను డ్రైవ్ చేస్తూ పనిచేయడంలో చాలా సంతోషం దాగుంటుందని చెబుతారు. తన నెక్ట్స్ టార్గెట్ 14 వీలర్ అని చెబుతారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఐటీఐలో ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పనిచేస్తూ..ఇంటినీ, తన ప్రవృత్తినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్నారు. 


 

English Title
Love with road roller ...
Related News