‘లవర్’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 07/20/2018 - 14:10
lover

బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్
న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్, రాజీవ్ క‌న‌కాల‌, సుబ్బ‌రాజ్‌, అజ‌య్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, స‌త్యంరాజేశ్‌ త‌దిత‌రులు
ఆర్ట్ : ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
కెమెరా: స‌మీర్ రెడ్డి
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్‌పూడి,
సంగీతం: అంకిత్ తివారి, అర్కో, రిషి రిచ్‌, అజ‌య్ వాస్‌, సాయి కార్తీక్‌, త‌నిష్క్ బాగ్చి
నేప‌థ్య సంగీతం:  జె.బి
నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌
 

lover

ఓ స‌క్సెస్‌ఫుల్ బ్యానర్‌లో సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు ఆ సినిమాపై ఆస‌క్తి క‌న‌ప‌రుస్తార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం అలాంటి న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రుచుకున్న బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. నిర్మాత దిల్‌రాజు మేకింగ్ ఆఫ్ మూవీ.. ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ కొత్త‌గా ఉంటుంది కాబ‌ట్టే ఆయ‌న స‌క్సెస్ రేట్ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఈ బ్యాన‌ర్ నుండి వ‌చ్చిన 28వ చిత్రం `ల‌వ‌ర్‌`. చాలా కాలంగా మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రాజ్‌త‌రుణ్‌కి.. దాదాపు మూడేళ్ల త‌ర్వాత సినిమా చేసిన డైరెక్ట‌ర్ అనీశ్ కృష్ణ‌కి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రిద్దికుమార్‌కి ఈ సినిమా స‌క్సెస్ ఎంత ముఖ్య‌మో... వారందంరి కంటే నిర్మాత హ‌ర్షిత్ రెడ్డికి ఈ స‌క్సెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే.. దిల్‌రాజు త‌ర్వాత త‌రం వార‌సుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన హ‌ర్షిత్ నిర్మాతగా చేసిన తొలి చిత్రం `ల‌వ‌ర్‌` ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:
రాజ్ (రాజ్ త‌రుణ్‌) అనంత‌పూర్‌లో ఓ బైక్ మెకానిక్‌.. కేవ‌లం బైకుల‌ను రిపేరు చేయ‌డ‌మే.. వాటిని త‌న తెలివి తేట‌ల‌తో మాడిఫై కూడా చేస్తుంటాడు రాజ్‌. అత‌ని అన‌్నయ్య జ‌గ్గు(రాజీవ్‌).. దందాలు చేసే సంప‌త్‌(సుబ్బ‌రాజు)కి అండగా ఉంటాడు. ఓ సందర్భంలో కొంద‌రు ప్ర‌త్య‌ర్థులు జ‌గ్గుపై ఏటాక్ చేస్తారు. అన్న‌య్య కాపాడే క్ర‌మంలో రాజ్‌కి చేతికి గాయ‌మవుతుంది. హాస్పిట‌ల్‌లో చేరిన రాజ్ అక్క‌డ  న‌ర్సు చరిత‌(రిద్దికుమార్‌)ని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వెంట‌ప‌డి, అనేక ప్ర‌య‌త్నాలు చేసి ఆమె ప్రేమ‌ను సొంతం చేసుకుంటాడు. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌కి చెందిన పేరు మోసిన రౌడీ(అజ‌య్‌).. త‌న మావ‌య్య (స‌చిన్ ఖేడేక‌ర్‌) కోసం చ‌రిత‌ను కిడ్నాప్ చేయాల‌నుకుంటారు. రాజ్ ఆమెను కాపాడి.. కేర‌ళ‌లోని చ‌రిత‌ను ఆమె ఇంటికి తీసుకెళ‌తాడు రాజ్‌. అదే స‌మ‌యంలో చ‌రిత త‌ల్లికి త‌మ ప్రేమ విష‌యాన్ని చెప్పి.. చరిత‌ను ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటాడు. అదే స‌మ‌యంలో మ‌రోసారి కోయంబ‌త్తూర్‌కి చెందిన రౌడీలు దాడి చేసి అడ్డం వ‌చ్చిన జ‌గ్గుని చంపేసి చ‌రిత‌ను ఎత్తుకెళ్లిపోతారు. ఇంత‌కు చ‌రిత‌కు.. కోయంబ‌త్తూర్ రౌడీల‌కు సంబంధం ఏంటి?  చివ‌ర‌కు రాజ్ రౌడీల బారి నుండి చ‌రిత‌ను ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

lover

స‌మీక్ష‌:
న‌టీన‌టులు విష‌యానికి వ‌స్తే మెకానిక్ రాజ్ పాత్ర‌లో రాజ్‌తరుణ్ ఇమిడిపోయాడు. త‌న పాత్ర ఎక్క‌డా ఓవ‌ర్ హైప్ కాలేదు. ఈజ్‌తో చాలా చ‌క్క‌గా చేశాడు. హీరోయిన్ రిద్ధికుమార్ క్యారెక్ట‌ర్‌కు మంచి ప్రాముఖ్య‌త ఉంది. రిద్ది కూడా చ‌క్క‌గా న‌టించింది. చాలా రోజుల త‌ర్వాత జ‌గ్గు అనే ఇంపార్టెంట్ రోల్‌లో రాజీవ్ క‌న‌కాల చ‌క్క‌గా న‌టించాడు. ఇక స‌చిన్ ఖేడేక‌ర్‌, అజ‌య్‌, సుబ్బ‌రాజు వంటి విల‌న్ గ్యాంగ్‌... స‌త్య‌, ప్ర‌వీణ్‌, స‌త్యం రాజేశ్ వంటి కామెడీ ట్రాక్‌ను పంచే కామెడీ గ్యాంగ్ అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్రేమ క‌థ అంటే హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం.. ఏదో స‌మ‌స్య వ‌చ్చి ఇద్ద‌రూ విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం.. ఇవి కామ‌న్‌గానే ఉంటాయి. ద‌ర్శ‌కుడు అనీశ్ క‌థ‌ను అలాగే రాసుకున్న త్రెడ్ పాయింట్‌ను హీరో, హీరోయిన్‌పై కాకుండా మ‌రో క్యారెక్ట‌ర్‌పై సెంట‌ర్ చేయ‌డం ... దాన్ని ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు తీసుకురావ‌డం బావుంది. హీరో.. అత‌ని స్నేహితులు మ‌ధ్య కామెడీ ట్రాక్‌.. హీరో హీరోయిన్ ప్రేమ కోసం చేసే ఫీట్స్‌.. వాటి వల్ల కామెడీ గొప్ప‌గా లేక‌పోయినా..బోరింగ్‌గా అయితే లేదు. ఫ‌స్టాఫ్ అంతా .. ముఖ్యంగా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు నార్మ‌ల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్ సినిమా అస‌లు క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక్క‌డ రాజీవ్ క‌న‌కాల పాత్ర.. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు మెయిన్ త్రెడ్ పాయింట్‌.. క్లైమాక్స్‌లో భారీ ఫైట్స్ లాంటివి చేయ‌కుండా హీరో.. లాజిక్‌గా విల‌న్స్‌ను చంప‌డం ఇలాంటి అంశాలు చ‌క్క‌గా ఉన్నాయి. స‌మీర్ రెడ్డి ప‌నితనం ప్ర‌ధాన‌బ‌లం. ఏదో చిలిపి క‌ళ‌.. అంతే కదా.. పాటలు.. వాటి పిక్చ‌రైజేష‌న్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి..

చివ‌ర‌గా... రొటీన్‌గా ప్రేమించే `ల‌వ‌ర్‌`.. ఓకే అనిపిస్తాడు 
రేటింగ్‌: 2.75/5

English Title
Lover Movie Review
Related News