`2.0` టీజ‌ర్ విష‌యంలో లైకా వివ‌ర‌ణ‌

Updated By ManamMon, 09/10/2018 - 12:15
2.O

2.Oసుభాష్ క‌ర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `2.0`. ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్రధానపాత్రలో న‌టించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా టీజ‌ర్‌ను ఈ నెల 13న విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే టీజ‌ర్‌ను కూడా నిర్మాణ సంస్థ 2డి, 3డి ఫార్మేట్స్‌ల్లో విడుద‌ల చేస్తుంది. అందుకు సంబంధించిన వివ‌ర‌ణ‌ను ఇచ్చుకుంది. 3డి ఫార్మేట్ అయితే కొన్ని థియేట‌ర్స్‌లో మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. ఇక యూ ట్యూబ్ స‌హా మిగిలిన మాధ్య‌మాలు, థియేట‌ర్స్‌లో 2 డిలోనే చూసే అవ‌కాశం ఉంటుందట‌. టీజ‌ర్ నుండే సినిమాపై అంచ‌నాలు త‌గ్గ‌కుండా ద‌ర్శ‌కుడు శంక‌ర్ చ‌క్క‌గా ప్లాన్ చేస్తున్నారు. కాగా సినిమాను ఇదే ఏడాది న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌బోతున్నారు. 

English Title
Lyca clarity on 2.O teaser
Related News