జోరుగా ఫ్లాట్ల విక్రయం

Updated By ManamMon, 02/12/2018 - 22:34
Trump Towers at Gurgaon

Trump Towers at Gurgaonన్యూఢిల్లీ: గుర్గాంవ్‌లోని ట్రంప్ టవర్స్ ప్రాజెక్టులో రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు గత నెల రోజుల్లో విక్రయించగలిగినట్లు స్థిరాస్తుల సంస్థ ఎం3ఎం ఇండియా సోమవారం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 250 యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 2,500 కోట్ల రాబడి చూడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి రియల్టీ బ్రాండ్ ‘ట్రంప్ టవర్స్’ ఎం3ఎం ఇండియా, త్రిబికా డెవలపర్స్ ద్వారా ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టింది. ‘‘ఈ ప్రాజెక్టును 2018 జనవరి మధ్యలో ప్రకటించాం. నెలకి కొద్ది తక్కువ కాలంలోనే రూ. 500 కోట్ల విలువైన ఫ్లాట్ల బుకింగులు సంపాదించగలిగాం. రోజుకు రెండు నివాసాల చొప్పున అమ్మగలుగుతున్నాం. ఒక్కో నివాసం సగటు ధర రూ. 7.5 కోట్లుగా ఉంటుంది’’ అని ఎం3ఎం ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భూమి ధర కాకుండా, రూ. 1200 కోట్ల పెట్టుబడితో ‘ట్రంప్ టవర్స్ ఢిల్లీ ఎన్.సి.ఆర్’ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును మార్కెట్ చేసే ప్రత్యేక హక్కులను త్రిబికా చేజిక్కించుకుంది. ట్రంప్ ఆర్గనైజేషన్ ట్రంప్ బ్రాండ్‌ను వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

English Title
M3M sells flats worth Rs 500 crore in Trump Towers at Gurgaon
Related News