'ఏ మాయ చేశావే' సీక్వెల్‌లో మాధవన్

Updated By ManamWed, 02/21/2018 - 10:55
Madhavan

Madhavan తమిళ్‌లో శింబు, త్రిష.. తెలుగులో నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'ఏ మాయ చేశావే'(తమిళ్‌లో విన్నైతాండి వరువాయా) సీక్వెల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ సీక్వెల్‌లో మాధవన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. అలాగే టివినో థామస్, పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. త్వరలో తెరకెక్కనున్న ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నట్లు ఖరారైంది. అయితే 2001లో 'మిన్నలె'(తెలుగులో చెలి) చిత్రానికి గానూ పనిచేసిన గౌతమ్ మీనన్, మాధవన్ కాంబినేషన్ దాదాపు 17 సంవత్సరాల తరువాత కలిసి పనిచేస్తుందటం విశేషం. మరి ఈ సినిమా తెలుగు సీక్వెల్‌ కోసం గౌతమ్ మీనన్ చైతూనే తీసుకుంటాడా? లేక వేరే హీరోకు అవకాశం ఇస్తాడా చూడాలి

English Title
Madhavan in Vinnai Thaandi Varuvaayaa sequel
Related News