సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మధు

Updated By ManamTue, 02/13/2018 - 08:18
CPM

CPM Madhu ఏలూరు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న 25 రాష్ట్ర మహాసభల్లో 60 మంది సభ్యులతో కార్యవర్గాన్ని నియమిస్తూ సోమవారం తీర్మానం చేశారు. ఇందులో 10 మంది ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారని నూతన కార్యదర్శి పి.మధు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యద ర్శిగా పి.మధు, కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎం.ఏ. గఫూర్, వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వర్లు, వి.కృష్ణయ్య, సి.హెచ్.నర్సింగరావు, ఎం.బాబూరావు, ఎం.వి. ఎస్.శర్మ, డి.సుబ్బారావు, ఎం.కృష్ణమూర్తి, సి.హెచ్. బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, డి.రమాదేవి, మంతెన సీతారాంలతో పలువురు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రజా పోరాటాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు తీర్మానించారు.

ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ప్రసంగిస్తూ... వామపక్ష ప్రజాతంత్ర సంఘటనే లక్ష్యంగా రాష్ట్రంలో సీపీఎం ప్రజాపునాదిని పెద్దఎత్తున విస్తరించాలని, ముఖ్యంగా యువత వివిధ స్థాయిలో పార్టీలో ప్రధాన పాత్ర పోషించేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వామ పక్ష ఉద్యమానికి ఘనమైన చరిత్ర ఉందని, ఇప్పటికీ ఇక్కడ సీపీఎం బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్ ఎస్‌ఎస్ కాషాయ భావాలకు ప్రజానీకంలో పెద్దగా ఆద రణ లేదని, అయితే తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో ప్రజాతంత్ర ఉద్యమాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఇది ప్రత్యామ్నాయ రాజకీయాలకు అనుకూలమైన సమయమని గుర్తించి పోరాటాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పోరాటాల్లో కలిసి వస్తున్న ప్రజానీకానికి  రాజకీయ విద్యను అందించడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. వివిధ స్థాయిల్లోని పార్టీ కమిటీలలో  యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు పాల్గొన్నారు.

English Title
Madhu elected as Andhrapradesh CPM incharge
Related News