మహాసంప్రోక్షణకు అంకురార్పణ

Updated By ManamSat, 08/11/2018 - 11:41
Tirumala

Tirumalaతిరుమల: పన్నేండేళ్లకోసారి నిర్వహించే బాలాలాయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శనివారం సాయంత్రం టీటీడీ అధికారులు అంకురార్పణ చేయనున్నారు. ఇక ఆదివారం నుంచి ఈ నెల 16వరకు బాలాలాయ మహాసంప్రోక్షణ జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

మరోవైపు మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 14గంటల్లో సుమారు 50వేల మంది దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి శ్రీవారి సేవలు యథావిధిగా మొదలౌతాయని పేర్కొన్నారు.

English Title
Maha Samprokshanam starts from today
Related News