'మ‌హాన‌టి'.. సెకండ్ సింగిల్ అప్‌డేట్‌

Updated By ManamWed, 04/25/2018 - 17:20
maha

mahanatiన‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన‌ బయోపిక్ 'మ‌హాన‌టి'. సావిత్రిగా కీర్తి సురేశ్ న‌టించిన‌ ఈ చిత్రంలో మోహ‌న్ బాబు, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలినీ పాండే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'స‌దా నన్ను' పాట‌ను రేపు (గురువారం) సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్య‌మందించ‌గా.. చారుల‌త‌మ‌ణి ఈ పాట‌ను గానం చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌పై ఈ పాట‌ను చిత్రీకరించార‌ని స‌మాచారం. కాగా.. ఇటీవ‌ల 'మూగ‌ మ‌న‌సులు' అంటూ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ సింగిల్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

English Title
'mahanati' second single update
Related News