టీజ‌ర్ టాక్‌.. అన‌గ‌న‌గా ఓ 'మ‌హాన‌టి'

Updated By ManamSat, 04/14/2018 - 18:59
mahanati

mahanatiతెలుగు సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తి ఎదురుచూస్తున్న 'మ‌హాన‌టి' చిత్రం టీజ‌ర్ రానే వ‌చ్చింది. అన‌గ‌న‌గా ఓ మ‌హాన‌టి అంటూ మొద‌లైన ఈ టీజ‌ర్‌లో.. న‌టీమ‌ణి సావిత్రి జీవితంలోని కీల‌క‌మైన సినిమాల తాలుకూ షాట్‌ల‌ను, ఘ‌ట్టాల‌ను చూపించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్‌ను చూస్తుంటే.. నిజంగా సావిత్రినే చూస్తున్న‌ట్లుగా ఉంది ఈ టీజ‌ర్ ఆసాంతం.  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న తెర‌పైకి రానుంది.
మోహ‌న్ బాబు, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, షాలిని పాండే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ నిర్మించారు.

English Title
'mahanati' teaser talk
Related News