పాలను కల్తీ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష

Updated By ManamTue, 03/13/2018 - 18:45
milk

milkముంబై: పాలను కల్తీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలను కల్తీ చేసేవారిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని మహారాష్ట్ర ఆహారపౌరసరఫరా శాఖా మంత్రి గిరీష్ బపత్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదని ఆయన చెప్పారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు చట్టం చేయాలని కూడా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పాలను కల్తీ చేస్తే ఆరునెలల జైలు శిక్షతో సరిపెడుతున్నట్లు గుర్తుచేశారు. శిక్షా కాలాన్ని మూడేళ్లకు పొడిగించినట్లు గిరీష్ తెలిపారు. రాష్ట్రంలో పాల స్వచ్ఛతను గుర్తించేందుకు నాలుగు మొబైల్ వ్యాన్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే స్వచ్ఛత పరీక్షలు నిరంతరాయం కొనసాగడం లేదని మంత్రి తెలిపారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి.. పాలను కల్తీ చేసే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గిరీష్ బపత్ స్పష్టం చేశారు.

English Title
Maharashtra to make milk adulteration non-bailable offenceRelated News