లీకైన మహేశ్ కొత్త సినిమా ఫొటోలు

Updated By ManamThu, 06/21/2018 - 09:31
mahesh
Mahesh

‘భరత్ అనే నేను’తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతుండగా.. అక్కడ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అందులో మహేశ్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తున్నాడు.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్, షాలిని కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Mahesh Babu photos leaked




Related News