27ఏళ్ల తరువాత హిట్ మూవీ సీక్వెల్

Updated By ManamThu, 09/20/2018 - 13:51
Sadak

Sadakసంజయ్ దత్, పూజా భట్ హీరో హీరోయిన్లుగా మహేశ్ భట్ తెరకెక్కించిన ‘సడక్’ అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్లు కురిపించింది. కాగా 27ఏళ్ల తరువాత ఈ చిత్ర సీక్వెల్‌కు ముహూర్తం కుదిరింది. దర్శకనిర్మాత మహేశ్ భట్ ఇవాళ 70వ పుట్టినరోజును జరుపుకుంటుండగా.. ఈ సందర్భంగా సీక్వెల్‌పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రానికి సడక్ 2 అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. దానికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ సీక్వెల్‌లో సంజయ్ దత్, పూజా భట్‌లతో పాటు అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కనిపించనున్నారు. ముఖేశ్ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా 1999లో కార్టూస్ అనే చిత్రానికి మహేశ్ భట్ చివరిసారిగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

 

English Title
Mahesh Bhatt returns to direction with Sadak sequel
Related News