'నలుగురి చేతుల్లో రాష్ట్రం బందీ అయింది'

Updated By ManamFri, 08/31/2018 - 20:05
Mallu Batti Vikramarka, Congress party, TPCC, TRS families
  • కాంగ్రెస్‌తోనే సంక్షేమ రాజ్యం 

  • అన్ని పంటలకు గిట్టుబాటు కల్పిస్తాం

  • భట్టి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 25 టీఆర్ఎస్ కుటుంబాలు

  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు

Mallu Batti Vikramarka, Congress party, TPCC, TRS familiesముదిగొండ : తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతుల్లో బందీ అయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియజకవర్గం ముదిగొండ మండలం కట్టకూరు గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో విక్రమార్కు పాల్గొన్నారు. అనంతరం ఎరపాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన పలు సంక్షేమ కార్యక్రమాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. కేవలం నాలుగేళ్లలో లక్షల కోట్ల అప్పుల్లోకి కేసీఆర్ ప్రభుత్వం నెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడంపై విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ళ బడ్జెట్ తో పాటు.. మరో 20 ఏళ్ల బడ్జెట్ కు సమానమైన అప్పులను.. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చారని అన్నారు.

▶ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీఅని విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ గెలుపుతో.. సంక్షేమ రాజ్యం.. రైతన్న రాజ్యం.. పూర్తిగా పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వస్తుందని విక్రమార్క చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర, విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అన్ని కార్యక్రమాలను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 

▶ అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం కట్టకూరు గ్రామంలో.. సీసీ రోడ్ల పనులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కు మల్లు శంకుస్థాపన చేశారు. మూడు లక్షల వ్యయంతో సీపీడీపీ నిధులతో.. ఈ రహదారులను నిర్మిస్తున్నారు.

▶ టీఆర్ఎస్ నుంచే భారీ చేరికలు
వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కట్టకూరు పర్యటనలో.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చింది. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందింది 25 కుటుంబాలు.. విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. భట్టి విక్రమార్క చేస్తున్న అభివృద్ధి పనులు చూసే పార్టీలో చేరినట్లు.. వారు చెప్పారు.

▶ భట్టికి బ్రహ్మ రథం
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లుపై.. కట్టకూరు ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. విక్రమార్కకు అడుగడుగునా.. ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు. విక్రమార్కపై.. పూల వర్షం కురిపించారు.

English Title
Mallu Batti Vikramarka slam TRS govt
Related News