అధికారికం: వైఎస్‌ఆర్ పాత్రలో మెగాస్టార్

Updated By ManamWed, 03/21/2018 - 12:36
YSr

YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర' అనే చిత్రం తెరకెక్కనుంది. 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో వైఎస్‌ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటనను ఇచ్చారు దర్శకుడు. ఇక జగన్, విజయమ్మ పాత్రల కోసం సూర్య, నయనతారలను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మాత్రం త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

English Title
Mammootty in YSR Biopic
Related News