బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కలకలం

Updated By ManamWed, 08/15/2018 - 13:11
Man Suicide Attempt Front Of  Banjarahills Police Station
  • బంజారాహిల్స్ పీఎస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Man Suicide Attempt Front Of  Banjarahills Police Station

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఇది చూసిన పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పి, ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ముషీరాబాద్‌కు చెందిన సతీష్‌గా పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్‌ దేవరకొండ బస్తీకి చెందిన యువతితో సతీష్‌కు వివాహమైంది. అయితే వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సతీష్ నిన్న అత్తంటి ఎదుట గొడవ చేయడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో తనపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సతీష్... అత్తింటివారిని బెదిరించాడు. అయితే వారు ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోవడంతో అతడు ఇవాళ ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

 

English Title
Man Suicide Attempt Front Of Banjarahills Police Station
Related News