మంచిరెడ్డి..ముచ్చటగా మూడోసారి..

Updated By ManamSun, 09/09/2018 - 15:14
Manchireddy Kishan Reddy to contest thrid time

mla manchireddy kishan reddy

ఇబ్రహీంపట్నం:  తెలంగాణ రాష్ట్ర సమితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిత్వానికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేశారు. అందరూ అనుకున్నట్లుగానే తెరాస అధినేత కేసీఆర్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మొదటి అభ్యర్థుల జాభితాను విడుదల చేశారు.

దీంతో ఇబ్రహీంపట్నంపై మరో మారు పాగా వేసేందుకు మం చిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదివరకే రెండు మార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలుపొందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నియోజకవర్గంపై గట్టి పట్టుంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఇబ్రహీంపట్నంలో గత 2009 ఎన్నికల్లో మహాకూటమితో బరిలోకి దిగిన మంచిరెడ్డి ఎమ్మెల్యేగా మొదటి సారి గెలుపొందారు. 

ఆ తరువాత 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ రెబెల్ మల్‌రెడ్డి రంగారెడ్డి, తెరాస నుండి పోటీలో ఉన్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డిలకు గట్టి షాక్ ఇస్తూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు.

mla manchireddy kishan reddy contest in mla

తెలంగాణ రాష్ట్ర సమితి నుండి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికి ఈ ప్రాంతంలో తెదేపా అభ్యర్థిగా గెలుపొందారంటే ఆయన చరిష్మా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందినప్పటికి ప్రస్తుతం తెరాసలో ఉండి నియోజ కర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, సమస్యల పరిష్కారానికి కృషి చేశారని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు సంపాధించారు.

దీంతో తెరాస అధిష్టానం కూడా ఆయన పేరునే ఖరారు చేసింది. అనుకున్నట్లుగానే ఆయనే ఇక్కడి నుండి తెరాస అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పుడే ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం నందివనపర్తి గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడో సారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పాగా వేసేందుకు కలిసివచ్చే అంశాలపై దృష్టి పెట్టారు.

English Title
Manchireddy Kishan Reddy to contest thrid time in mla post
Related News