అక్కినేని ఇంటి కోడ‌లిగా..మ‌ణిర‌త్నం 'అమృత‌'

Updated By ManamWed, 02/14/2018 - 21:27
keerthana

keerthanaలెజండ‌రీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన త‌మిళ చిత్రం ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’ (తెలుగులో ‘అమృత’). 2002లో విడుద‌లైన ఈ సినిమాలో మాధవన్, సిమ్రాన్, జేడీ చ‌క్ర‌వ‌ర్తి, నందితా దాస్ వంటి హేమాహేమీలు న‌టించిన‌ప్ప‌టికీ.. గుర్తింపు ద‌క్కించుకుంది మాత్రం అందులో చిన్నారి అమృత పాత్రలో న‌టించిన కీర్తన. ఆ  పాత్ర‌తో ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా విడుదలై 16 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఆ చిన్నారి పెళ్ళి పీట‌లెక్క‌నుంది.

keerthanaఇంత‌కీ ఈ కీర్త‌న మ‌రెవ‌రో కాదు.. సీనియర్ తమిళ నటులు పార్తీబ‌న్, సీత గారాల పట్టి. కొద్దికాలం క్రితం విడిపోయిన ఈ జంట.. కూతురు పెళ్లి కోసం కలిసి పెళ్లి పనులు చూసుకుంటున్నారని సమాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. కీర్తన పెళ్లి చేసుకోబోతున్నది సినిమాకి చెందిన వ్య‌క్తినే.  ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తనయుడు, హిందీ  ‘పిజ్జా’ ద‌ర్శ‌కుడు అక్కినేని అక్ష‌య్‌ను కీర్త‌న ప‌రిణ‌య‌మాడ‌నుంది. కాగా, మార్చి 8న కీర్త‌న‌, అక్ష‌య్ క‌ల్యాణం జరుగనుంది. కొస‌మెరుపు ఏమిటంటే... ‘అమృత’ ఎడిట‌ర్ మ‌రెవ‌రో కాదు.. కీర్త‌నకి కాబోయే మామ‌గారు శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌నే.

keerthanaa

English Title
maniratnam 'amrutha' going to akkineni's daughter-in-law
Related News