మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్‌.. 'న‌వాబ్'

Updated By ManamFri, 02/09/2018 - 19:12
nawab

nawabజాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు మణిరత్నం. జ‌యాప‌జయాలతో సంబంధం లేకుండా ఆయ‌న సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు భార‌తీయ‌ ప్రేక్ష‌కులు. ప్ర‌స్తుతం ఈ లెజండ‌రీ డైరెక్ట‌ర్‌.. కుటుంబకథా నేపథ్యంగా సాగే ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక‌, అదితి రావ్ హైద‌రీ, ఐశ్వ‌ర్య‌రాజేష్‌, ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి శుక్ర‌వారం తెలుగు, త‌మిళ భాష‌ల్లో టైటిల్స్‌ను ప్ర‌క‌టించారు. తెలుగులో ‘నవాబ్’ పేరుని.. త‌మిళంలో ‘చెక్క చివంద‌ వాణం’ అనే పేరుని నిర్ణ‌యించారు. ఈ రెండు భాష‌ల‌కి చెందిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్స్‌ను కూడా శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి క‌ళ్ళ‌ను చూపుతూ డిజైన్ చేశారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూరుస్తున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌కు గాను సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలను అందిస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా తెర‌పైకి రానుంది.

English Title
maniratnam multistarrer 'nawab'
Related News