సీబీఐ కొత్త డైరక్టర్‌గా తెలుగు ఐపీఎస్

Updated By ManamWed, 10/24/2018 - 08:34
Mannem Nageswara Rao

Mannem Nageswara Raoన్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరక్టర్‌గా తెలుగు ఐపీఎస్ మన్యం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిశా కేడర్ అధికారి కాగా.. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

అయితే సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కేంద్రం కలగజేసుకుంది. ఈ క్రమంలో సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మను తొలగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో మన్నెం నాగేశ్వరరావు ఎంపికయ్యారు. కాగా నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్.

English Title
Mannem Nageswara Rao appointed as CBI new director
Related News