భార్యను చితకబాదిన మణుగూరు ఎస్ఐ

Updated By ManamFri, 08/31/2018 - 09:28
case filed against Manuguru SI Jitender
case filed against Manuguru SI Jitender

కొత్తగూడెం : అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఎస్ఐ విచక్షణ కోల్పోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ... కట్టుకున్న భార్యతో పాటు ఆమె తల్లిని కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఐపై మణుగూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జితేదంర్ మూడేళ్ల క్రితం న్యాయవాది అయిన పర్వీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భర్త వైఖరిలో మార్పు రావడాన్ని గమనించిన పర్వీన్... ఆరా తీయగా జితేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. 

ఇదే విషయంపై భర్తను నిలదీయడంతో భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుట్టింటిలో ఉన్న పర్వీన్ నిన్న (గురువారం సాయంత్రం) ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్తతో పాటు మరో మహిళ ఉండటాన్ని గమనించిన పర్వీన్ జితేందర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ జితేందర్‌ అతి దారుణంగా రక్తం వచ్చేలా చితకబాదాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించాన ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

English Title
Manuguru SI Jitender Beating Wife and Family Members, case filed
Related News