మళ్లీ ఎర్ర బీభత్సం!

Updated By ManamWed, 09/26/2018 - 01:30
Maoist moments

imageనివురు గప్పిన నిప్పు మళ్ళీ రాజుకుంది. కొన్నా ళ్ళుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన ఆంధ్రప్రదే శ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తుపాకీ గుళ్ళకు బలికావడం తో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. టీడీపీ ఆధ్వర్యంలో జరిగే గ్రామదర్శిని సభలో పాల్గొ నేందుకు వెళ్తున్న ఆ ఇద్దరినీ దాదాపు 65 మందికి పైగా నక్సలైట్లు నిర్బంధించి హతమార్చారు. అందు కు నిరసనగా వారి అనుచరులు ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీసుస్టేషన్లను విధ్వంసం చేశారు. ప్రజాకంటకులుగా మారిన కొంతమందిని లక్ష్యంగా చేసుకొని హతమార్చినంత మాత్రాన సామాజిక, ఆర్థి క, రాజకీయ సమస్యలకు పరిష్కారం లభించదన్న అవగాహనతో చారూ మజుందార్ కాలం నాటి వ్యక్తి గత హింసావాదాన్ని విడనాడి, సాయుధ పోరాటాన్ని విముక్తిమార్గంగా ఎంచుకున్న వామపక్ష విప్లవకారులు మళ్లీ ఇలాంటి దాడులకు తలపడడంపై అనేక సందే హాలు వ్యక్తమవుతున్నాయి.

 దండకారణ్యం మృత్యుక్షేత్రం
సంచలనాత్మక దాడులకు నక్సల్స్ పాల్పడటం, అందుకు ప్రతిగా ప్రభుత్వాలు మావోయిస్టులను ఎన్‌కౌంటర్లలోimage చంపేయడం వంటి హింసాత్మక ఘటనలతో దండకారణ్యం కొన్నేళ్లుగా మృత్యుక్షేత్రం గా మారింది. కాగా ఈ సాయుధ వామపక్ష కార్యకలా పాల్ని శాంతి భద్రతల సమస్యగానే చూడొద్దని, పోలీసులు, నక్సల్స్ మధ్య జరుగుతున్న యుద్ధంగా కాక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా గుర్తించి అందుకనుగుణంగా విధానాలు రూపొందించుకోవా లని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నా ఆ దిశగా పాల కులు దృష్టి సారించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో గడచిన నాలుగేళ్ళుగా మావోయిస్టుల సమస్య పూర్తిగా సమసిపోయిందని ప్రతి ఏడాది ఆ రాష్ట్రాల పోలీసు శాఖలు ప్రకటిస్తున్న అంకెల వివరాలను తల్లకిందు లు చేస్తూ మన్యంలో మావోయిస్టులు మళ్ళీ దాడు లకు సాహసించారు. 2016 అక్టోబర్‌లో ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30 మంది సహా, ఆ తర్వాత వరుసగా దండకారణ్య వ్యాప్తంగా అనేక ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు మృ తిచెందడంతో ఆ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిం ది. దాదాపు గత మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతం లోని 40 శాతం మేర ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించినట్లు ఇటీవల సీ ఆర్‌పీఎఫ్ అధినేత గర్వంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. ఈ నెల 21 నుంచి విలీన వారోత్సవాలు ప్రారంభ కానున్న సందర్భంగా తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ వర్గాలు భావిస్తు న్నాయి. మావోయిస్టు గెరిల్లా సైన్యం ఏర్పాటు, అమరవీరుల దినోత్సవం తదితర ముఖ్యమైన కార్యక్రమాల సందర్భంగా మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడుతారన్న విషయం అధికారులకు తెలియకపోలేదు. 

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు చేస్తున్న బాక్సైట్ అక్రమ తవ్వకాలు, గూడ గ్రామంలోని నల్లరాయి క్వా రీ వివాదాలను మావోయిస్టులు ప్రస్తావించి హత మార్చినట్లు సమాచారం. ఈ క్వారీ అనుమతులు ర ద్దుచేయాలంటూ గత కొద్దికాలంగా స్థానిక ప్రజలు ఆందోళనలు సాగుతూ, విచారణ కమిటీ క్వారీ నిర్వ హణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మావోలు ఈ హత్యకు పాల్పడ్డారు. అనేక ఖనిజ సం పదలకు ఆలవాలంగా ఉన్న దండకారణ్య ప్రాంతంలో 2000 ప్రారంభం నుంచి ప్రపంచ ఖనిజ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ వల్ల ప్రభుత్వ అనుమతితో జరిగే మైనింగ్ కార్యకలాపాలకు సమాంతరంగా అక్రమ మైనింగ్ కూడా పెద్ద ఎత్తున సాగుతుండడంతో స్థానిక పర్యావరణనానికి, ఆదివాసీల జీవనానికి ప్రమాదక రంగా మారింది. దేశంలోని ప్రధాన స్రవంతి నాగ రిక సమాజానికి దూరంగా కొండకోనల్లో విసిరేసి న ట్టుగా బతుకుతున్న కోట్లమంది ఆదివాసులు నేటికీ ప్రభుత్వాల, పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఏళ్ళతర బడి మగ్గుతున్నారు. వీరి అభ్యున్నతికి ఉన్న చట్టాలు అమలు కావు, సంక్షేమ+అభివృద్ధి పథకాలు కాగితా లకే పరిమతమయ్యాయి. అంతరిస్తున్న జీవజాతులు మాదిరిగా అడవుల్లో ‘ఉనికికై పోరాటం’ చేస్తూ బతు కులీడుస్తున్న ఆదివాసులను కనీసం ప్రాణమున్న జీవ జాతులుగా కూడా సర్కారు పరిగణించడం లేదు. పులులు, సింహాలకు రిజర్వ్‌లను రూపొందించి పరి రక్షణ చేపడుతున్న కనీస మాత్రం బాధ్యతగా కూడా ఈ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. సర్కారు నిర్లక్ష్యా నికి గురై పోషకాహార లోపాలు, రోగాలు రొష్టులతో ‘ప్రకృతి వరణం’లో జీవజాతుల్లా మనుగడ ప్రశ్నార్థ కంగా మారిన ఆదివాసుల జీవితాల్లోకి సర్కారు అం డతో కార్పొరేట్ ఖనిజ దిగ్గజాలు చొచ్చుకువచ్చి ఆ మాత్రం జీవితాన్ని కూడా లేకుండా బుగ్గిపాలు చే స్తుండడంతో  ఆదివాసుల్లో అసంతృప్తి పెల్లుబుకింది. 

గిరిజనుల జీవనోపాధిని దెబ్బతీసి, సంస్కృతీ సంప్రదాయాలను మంటగలిపే వివిధ ఖనిజాల మై నింగ్ కార్యకలాపాలు వారి ఉనికికే ప్రమాదంగా తయారయ్యాయి. తమ గూడేలు, గ్రామాలకు పెను ముప్పు వాటిల్లుతోందని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు సహా దండకారణ్యమంతా మైనింగ్‌కు వ్య తిరేకంగా స్థానిక ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళన లు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో బాక్సైట్ మైనింగ్, తెలంగాణ బొగ్గు ఓపెన్ కాస్ట్ మైనింగ్ కార్యక్రమాలు ముమ్మరమైనాయి. పర్యావరణ విధ్వంసంతో తమ కు మనుగడకు విఘాతం కలిగించే మైనింగ్ కార్యక్ర మాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నా బాక్సైట్ తవ్వకాలకు ఊతమిచ్చే వినాశకరమైన జీవో నెంబర్ 97ను చంద్ర బాబు ప్రభుత్వం ఇప్పటివరకు రద్దు చేయలేదు. ఏజె న్సీ ప్రాంతాల్లో గిరిజన భూములకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని ప్రభుత్వమే నిర్వీర్యం చేసి, భూ అక్రమాలు చేసేందుకు గిరిజనేతరులను, కార్పొరేట్ల ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్ళించడమే కాక, హక్కుల చట్టం పీసా (పిఇ ఎస్‌ఎ)ని ఈ పాలకులే బుట్టదాఖలు చేశారు. 

ఆదివాసీల అసంతృప్తి సర్కారు నిర్వాకమే!
ఆస్పత్రులు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్, తాగు నీరు, విద్య తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులో లేకపోవడమే కాదు, అభివృద్ధి ప్రాజెక్టుల వలన భూములు, ఆవాసాలు కోల్పోయిన నిర్వాసి తులకు సహాయ పునరావాస ప్యాకేజీలు కూడా ప్రభుత్వాలు అమ లు చేయడం లేదు. మలేరియా, డెంగీ, ఆంత్రాక్స్, సికిల్ సెల్ ఎనేమియా వంటి వ్యా ధులకు పిట్టల్లా గిరిజనులు రాలిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి సత్వర చర్యలు చేపట్టడం లేదు. ఆదివాసు ల్లోని వ్యాపార అనుభవం గల తెగ ప్రజలను, తెగ పెద్దలను చేరదీసి వారిని రాజకీయ నాయకులుగా తయారు చేయడం, వారిని ముందుపెట్టి అటవీ సంపద, సహజ వనరులు, ఖనిజ సంపదలను కొల ్లగొట్టే మాఫియా యంత్రాంగంగా తీర్చిదిద్దుతున్నారు. మైనింగ్ వ్యాపారం, అందుకు ఆదివాసీల పేరుతో భూ అనుమతులు పొందే బినామీ వ్యాపార లావా దేవీలు పునాదిగా పెత్తందారులుగా తయారైన మైనిం గ్ మాఫియాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు వారిని ప్రోత్సహిస్తుండడంతో గిరిజనుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి తారస్థాయికి చేరుకోవడం సహజమే. ఇప్పుడు మావోయిస్టులు హత్యచేసిన రాజకీయ నేతలు కిడారి, సోమల ఇలాంటి అక్రమ మైనింగ్, బినామీ కార్యకలాపాల నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ నేతలే కావడం మావోయిస్టులకు టార్గెట్లయ్యారు.     

మైదాన, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో భూస్వా మ్యానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక, మహిళా ఉద్యమాల పునాదిగా ఉద్భవించిన మిలిటెంట్ వామపక్ష ఉద్య మాలు దీర్ఘకాల సాయుధ పోరాట అవసరాల నేప థ్యంలో నుంచి అటవీ ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పుకుంటున్న లక్ష్యమేమైనప్పటికీ, ప్రభుత్వ నిర్బం ధంలో విశాల ప్రజారాశుల్ని కదలించవలసిన సామ ర్థ్యం కోల్పోయిన కారణంగానే అనివార్యంగా ఆదివా సీ ప్రాంతాలకే పరిమితమైన ట్లుంది. అటవీ, వెనక తట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ, నగర ప్రాంతాల్లోకి అంచెలంచెలుగా విముక్తి చేసుకుంటూ అంతిమంగా ఢి ల్లీ కేంద్రాన్ని హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు చెప్పుకుంటున్నా రు. అయితే మైదాన, పల్లె, పట్టణ ప్రాంతాల్లో కర్షకు లు, కార్మికుల, విద్యార్థి, యువజన, మహిళలు, మేధా వుల్లో మావోయిస్టు ఉద్యమం బలహీనపడిన మాట వాస్తవం. వామపక్ష ఉద్యమం విప్లవ ప్రజానీకమైన శ్రమజీవుల సారథ్యంలో నడవాల్సినప్పటికీ, విప్లవ భావజాలాన్ని విప్లవ ప్రజానీకానికి నిరంతరం అం దించే కన్వేయర్ బెల్ట్ లాంటి విద్యార్థి, యువజన, మేధావి వర్గం పాత్ర లేనిదే విప్లవోద్యమం అభివృద్ధి, విజయవంతం సాధ్యం కాదు.  

సైద్ధాంతిక నాయకత్వం కొరత
మైదాన ప్రాంత ఉద్యమం దెబ్బతినడంతో విప్ల వ భావజాలాన్ని విప్లవ ప్రజారాశుల్లోకి తీసుకురాగల అవకాశాలు అడుగంటి మావోయిస్టు ఉద్యమం దేశం మొత్తానికి నాయకత్వం వహించగల సైద్ధాంతిక నా యకత్వం కొరతతో వరుస వైఫల్యాలకు గురవు తోంది. మావోయిస్టు శ్రేణుల్లో (రాష్ట్ర, కేంద్ర కమిటీల స్థాయి దాకా) దాదాపు ముప్పావు వంతుకు పైగా స్థానిక దండకారణ్య ఆదివాసులతో నిండిపోయింది. పోరాడే ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమ నాయకత్వం లోకి రావడం మంచి పరిణామమే అయినప్పటికీ, అది మైదాన, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని కార్మిక, కర్షక తదితర శ్రమ జీవులు, విద్యార్థులు, మహిళలు, మేధావుల సమ్మేళనంతో రూపొంది ఉంటే అలాంటి నాయకత్వం యావత్ దేశాన్ని విముక్తి పథంలో నడిపించగలిగే లక్షణాలను సంతరించుకుని ఉండేది. అయితే నాయకత్వం రూపొందిన వర్గ స్వభావం, విశాలమైన మైదాన ప్రాంతాల నుంచి మార్క్సిస్టు భావజాలంతో కూడిన వ్యక్తుల రిక్రూట్‌మెంట్ ప్రవా హం నిలిచిపోవడం, ఆదివాసీల ప్రాంతాల నుంచి ఇ తరత్రా ప్రాంతాలకు విస్తరణలో స్తబ్దత వగైరాల కార ణంగా ప్రస్తుత మావోయిస్టు నాయకత్వంలో కార్మిక వర్గ దృక్పథం కంటే స్థానిక ఆదివాసీ లేదా పేద ప్రజ ల, వివిధ కుల, మత, జెండర్ అస్తిత్వాలకు చెందిన దృక్పథమే ప్రధానంగా ఉంది.

ఆ కారణంగా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలోని జాతి విముక్తి ఉద్యమ స్వభా వమే అంతర్లీనంగా ప్రబలంగా ఉన్నట్లుంది. శతా బ్దాల నుంచి ‘కదంతాల్’ స్థితిలో (హిస్టారికల్ మార్కింగ్ టైం) కొనసాగుతున్న, గిడస బారిన ఆది వాసీ సమాజం నుంచి ప్రధానంగా క్షేత్ర స్థాయిలోను, ఉన్నత స్థాయిలోనూ కీలక బాధ్యతల్లో కొనసాగుతు న్న మావోయిస్టు నాయకత్వ శ్రేణులకు  పరిమితులు ఏర్పడిన పర్యవసానంగా జాతీయ విప్లవాన్ని, పట్టణ, నగర ఉద్యమాలను నిర్మించడంలో తీవ్ర సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో  శ్రీలంకలో టైగర్ల ను నిర్మూలించిన తరహాలో దండకారణ్యంలో తిష్ట వేసుకున్న వామపక్ష తీవ్రవాదాన్ని తుడిచిపెట్టాలను కుంటున్న ప్రభుత్వ ప్రయత్నాలను నిలువరించి స్థాని క ఆదివాసుల ప్రయోజనాలను, దేశవ్యాప్త వామపక్ష విప్లవాన్ని విజయవంతం చేయడం మావోయిస్టు నా యకత్వానికి అసాధ్యమవుతుంది. 

 

English Title
Maoist moments
Related News