మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి మృతి

Updated By ManamSun, 09/23/2018 - 13:19
Kidari Sarveswara Rao attacked by maoist

Maoists attack Araku mla Kidari Sarveswara Rao in gramadharsani sabha

విశాఖ : విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం గ్రామదర్శిని సభకు వెళ్లిన  ఆయనపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. డుంబ్రిగూడ మండలం తుంటంగి వద్ద మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారితో పాటు, మరికొందరిపై కాల్పులు జరిపారు. వీరిద్దర్ని అతి సమీపంలో కాల్చి చంపినట్లు సమాచారం. దీంతో వారిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది.

Kidari murderమావోయిస్టుల దాడి ఘటనపై ఎస్పీ రాహుల్ దేవ్ ఈ ఘటనపై స్పందించారు. ఎమ్మెల్యే కిడారిపై మావోయిస్టులు దాడి జరిపిన సమాచారం అందిందని, ఘటనా స్థలానికి సిబ్బంది బయల్దేరి వెళ్లిందన్నారు. కాగా ఈ దాడి ఘటనలో 50మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఇటీవలే కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరారు. కాగా ఎమ్మెల్యే కిడారిని తన వైఖరిని మార్చుకోవాలని మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. ఆయన 2014లో తొలిసారిగా శానససభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కిడారికి భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు. 

English Title
Maoists attack Araku mla Kidari Sarveswara Rao in gramadharsani sabha
Related News