మారన్ సోదరులకు ఊరట

Updated By ManamWed, 03/14/2018 - 22:51
image
  • అక్రమ ఎక్స్చేంజి కేసు నుంచి విముక్తి

  • ప్రాథమిక ఆధారాల్లేవన్న సీబీఐ కోర్టు

imageచెన్నై : కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్, ఆయన అన్న కళానిధి మారన్ ఇద్దరికీ సీబీఐ ప్రత్యేక కోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు దశాబ్ద కాలం నాటి అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజి కేసులో వారిద్దరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల మీద మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఏమీ లేవని, అందువల్ల అందరినీ నిర్దోషులుగా విడిచిపెడుతున్నామని సీబీఐ ప్రత్యేక జడ్జి నటరాజన్ తన తీర్పులో తెలిపారు. 2004 జూన్ నుంచి 2006 డిసెంబర్ వరకు దయానిధి మారన్ కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలోని తన ఇళ్లలో అక్రమంగా ఒక ప్రైవేటు టెలిఫోన్ ఎక్స్చేంజి ఏర్పాటుచేసుకున్నారని, సన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల కోసం దాన్ని వాడుకున్నారని సీబీఐ అప్పట్లో ఆరోపించింది. దానివల్ల ఖజానాకు రూ. 1.78 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. బోట్‌క్లబ్, గోపాలపురం ప్రాంతాల్లోని ఆయన ఇళ్లలో 700కు పైగా టెలిఫోన్ లైన్లు ఏర్పాటుచేసుకున్నారని చెప్పింది. ఈ కేసులో బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ జనరల్ మేనేజర్ కె. బ్రహ్మనాథన్, మాజీ డీజీఎం ఎంపీ వేలుస్వామి, దయానిధి మారన్ ప్రైవేటు కార్యదర్శి గౌతమన్ కూడా నిందితులుగా ఉన్నారు. దయానిధి మారన్‌పై మరో రెండు కేసులున్నాయి. ఎయిర్‌సెల్-మాక్సిస్ డీల్‌కు సంబంధించి 2014లో సీబీఐ కోర్టులో దాఖలుచేసిన చార్జిషీటులో.. మలేసియా కంపెనీ మాక్సిస్ యజమాని టి. ఆనందకృష్ణన్‌తో దయానిధి మారన్ కుట్ర పన్ని, ఎయిర్‌సెల్‌కు చెందిన శివశంకరన్ తన షేర్లను బలవంతంగా కృష్ణన్‌కు అమ్మేలా చేశారని ఆరోపించింది. ఇక ఇదే కేసులో సీబీఐ విచారణ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దయానిధిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఆయనకు చెందిన రూ. 742.58 కోట్ల విలుైవెన ఆస్తులను 2015 ఏప్రిల్ 2న ఈడీ ఎటాచ్ చేసింది.

English Title
Maran's frustration for the brothers
Related News