నష్టాల్లోనే మార్కెట్లు

Updated By ManamSat, 10/20/2018 - 04:12
Markets in losses

imageముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సెన్సెక్స్ శుక్రవారం 464 పాయింట్లు పతనమై 34,315.63 వద్ద ముగిసింది. నిధుల ప్రవాహాలు మెరుగుపరచేందుకు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు సడలించినప్పటికీ, ద్రవ్యతకు సంబంధించిన ఆందోళనలతో ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫినాన్షియ ల్ రంగ షేర్లు నష్టాలు చవిచూశాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి నిఫ్టీ కూడా దాదాపు 150 పాయింట్లు నష్టపోయి 10,400 స్థాయికి దిగువన ముగిసింది. సూచిలోని 50 కంపెనీల్లో 30 కంపెనీల షేర్ల ధరలు పతనాన్ని చూశాయి. ఫలితంగా, నిఫ్టీ 10,303.55 వద్ద ముగిసింది. రిలయన్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి రికార్డు స్థాయిలో లాభాలు ప్రకటించినప్పటికీ, దాని షేర్ ధర శుక్రవారం డే ట్రేడ్‌లో దాదాపు 7 శాతం క్షీణించింది. దాని స్థూల రిఫైనింగ్ మార్జిన్లు క్షీణించడంతో షేర్ ధర తగ్గింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి అది 4.11 శాతం క్షీణించిన స్థితిలో ఉంది. హౌసింగ్ ఫినాన్స్ దిగ్గ జం హెచ్.డి.ఎఫ్.సి కూడా 4.32 శాతం క్షీణత చూసిం ది. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలకు నిధుల ప్రవా హాలు మెరుగుపరచేందుకు ఆర్.బి.ఐ కొన్ని చర్యలు ప్రకటించినా లిక్విడిటీపై ఆందోళనలు కొనసాగాయి. 

ఆర్బీఐ చర్యలు
లిక్విడిటీ కవరేజి నిష్పత్తి అవసరాలు తీర్చుకునేం దుకు, ఎన్.బి.ఎఫ్.సిల కిచ్చిన ఇన్‌క్రిమెంటల్ ఔట్‌స్టాం డింగ్ క్రెడిట్‌కు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలు ఉపయోగించుకునేందుకు బ్యాంకులకు ఆర్.బి.ఐ అను మతి ఇచ్చింది. బ్యాంకులు నిబంధనల మేరకు చూపవ లసిన నిధుల విషయంలో కలత చెందనవసరం లేదు. అవి ఎన్.బి.ఎఫ్.సిలకు, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలకు ఇచ్చిన రుణాల మొత్తానికి సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను దానికి ప్రతిగా చూపిస్తే సరిపోతుంది. అక్టోబర్ 19 నాటికి ఉన్న స్థితిని అవి ఇందుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే, నాన్-ఇన్‌ఫ్రా ఎన్.బి.ఎఫ్.సిలకు ఉన్న సింగిల్ రుణ పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ చర్య హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలు లిక్విడిటీని సమకూర్చుకునేందుకు సహాయప డుతుంది. ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్ గ్రూప్ కంపెనీలు వరుసగా రుణాలు ఎగవేస్తూ రావడంతో అవి ఒత్తిడికి లోనయ్యాయి. స్వల్పకాలిక అవసరాలు తీర్చుకునేందు కు ఫినాన్షియల్ సంస్థల వద్ద హెచ్చు లిక్విడ్ ఎసెట్లు ఉండాలి. వాటిని లిక్విడిటీ కవరేజి నిష్పత్తి సూచిస్తుంది. ఆర్.బి.ఐ ఈ సదుపాయం 2018 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

వీడని వాణిజ్య యుద్ధ భయాలు
‘‘అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెన్నాడుతూనే ఉన్నాయి. ఫలితంగా అవి తీవ్ర imageహెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం వెల్లడైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ చర్చల వివరాలు , అమెరికా విధాన నిర్ణేతలు వడ్డీ రేట్ల పెంపు విషయంలో ముందుకు సాగుతారని సూచించాయి. అమెరికా డిసెంబర్‌లోనే వడ్డీ రేట్ల పెంపును చూడవచ్చు’’ అని జియోజీత్ ఫినాన్షియల్  సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 

‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించిన క్యూ 2 ఫలితాలు దాని చమురు శుద్ధి వ్యాపార విభాగంలో తగ్గిన మార్జిన్లను ప్రతిబింబించాయి. ఇన్ఫోసిస్ ప్రకటించిన లాభాలు ఆకర్షణీయంగానే ఉన్నాయికానీ, మార్జిన్లు నిరాశపరచాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధన విభాగ ఉపాధ్యక్షుడు సంజీవ్ జర్బడే అన్నారు. 

ఆర్బీఐ తిరస్కృతి ప్రభావం
ఇక సెన్సెక్స్‌లో ఘోరంగా దెబ్బతిన్నది ఎస్ బ్యాంక్. దాని షేర్ ధర ఏకంగా 6.06 శాతం క్షీణించింది. ఈ బ్యాంక్‌లో చాలా కాలంగా పనిచేస్తున్న సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు అనుమతి ఇవ్వడానికి ఆర్.బి.ఐ తిరస్కరించింది. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని 2019 ఫిబ్రవరి 1 కల్లా నియమించి తీరాలని ఆదేశించింది. 

నష్టాలతో ముగిసిన వారం
వారం మొత్తంమీద సెన్సెక్స్ 417.95 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 168.95 పాయింట్లు కోల్పోయింది.

English Title
Markets in losses




Related News