నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

Updated By ManamMon, 04/16/2018 - 10:00
Markets in the red but recovering; Sensex above 34,000-mark

Stock markets, negitive note, Domestic markets indexesముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో నెగిటివ్ నోట్‌తో ప్రారంభమైన దేశీయ సూచీలు అంతలోనే మళ్లీ పుంజుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు మేర నష్టపోయి 34,000 మార్క్‌కు దిగువన పడిపోయింది. కానీ, అంతలోనే మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ సూచీలు ఉదయం 9.30 గంటల వరకు 73.20 పాయింట్లు దిగువగా 34,119.45 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు విస్తృత నిఫ్టీ కూడా 80 పాయింట్లతో (రెడ్) ప్రారంభమై మైల్‌రాయి 10,400 మార్క్‌కు దిగువగా కొనసాగుతోంది.

కానీ, ఉదయం ప్రారంభ సూచీల ట్రేడింగ్ మొత్తం నష్టాలను చవిచూసింది. ప్రధానంగా ఐటీ స్టాక్ మార్కెట్లు వెనక్కి తగ్గడంతో సెన్సెక్స్ నష్టాలబాటపట్టగా, ఐటీ సబ్ -ఇండెక్స్ 1.30 శాతం పడిపోవడం నిఫ్టీని కూడా దెబ్బతీసింది. మిగతా అన్ని ఉప సూచీలు గ్రీన్‌లో ట్రేడింగ్ అవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్, టుబ్రో, ఐటీసీ భారీ లాభాలు పండిస్తుండగా.. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, యాక్సిక్ బ్యాంకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

English Title
Markets in the red but recovering; Sensex above 34,000-mark
Related News