యదార్థ ఘటనలతో ‘మర్లపులి’

Updated By ManamThu, 03/22/2018 - 03:26
MARLAPULI

MARLAPULIసుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం ‘మర్లపులి’. వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో, అర్చన ప్రధాన పాత్రలో నటించి న ఈ చిత్రానికి దర్శకుడు డి.రామకృష్ణ. నిర్మాతలు బి సుధాకర్‌రెడ్డి, బి.భవాని శంకర్, ఖమ్మం శ్రీనివాస్. ఈ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘1983 సంవత్సరంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్ర మిది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన సినిమా’’ అన్నారు. దర్శ కుడు రామకృష్ణ మాట్లాడుతూ ‘‘13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. మంచి కథ, యథార్థగాథ కనుక తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. 

Tags
English Title
'Marlapuli' with real events
Related News