వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి

Updated By ManamSat, 09/22/2018 - 13:28
Venkatesh

Venkateshవిక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహానికి సన్నాహాలు ప్రారంభమైనట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు(మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి కుమారుడి)తో అశ్రిత వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ సోదరుడు సురేష్ బాబు... వరుడి నివాసానికి వెళ్లి ...పెళ్లి విషయాలు మాట్లాడినట్లు సమాచారం.

దీనికి సంబంధించిన ఇరు కుటుంబాల సభ్యులు వివాహాన్ని ఖరారు చేసుకున్నట్లు భోగట్టా. కాగా బేకరీ రంగంలో శిక్షణ తీసుకున్న అశ్రిత ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో సిటీలో పలు స్టాల్స్‌ను నిర్వహిస్తోంది. కాగా వెంకటేశ్ ప్రస్తుతం ఎఫ్‌ 2 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉండగా.. ఆయన హైదరాబాద్‌కు రాగానే కుమార్తె నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

అయితే గతంలో అశ్రితను నాగార్జున రెండో కొడుకు,  హీరో అఖిల్ తో వివాహం జరిపిస్తారనే రూమర్స్ వినిపించాయి కూడా.  కాగా వెంకటేశ్ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే విషయం తెలిసిందే. రేర్ గా మాత్రమే వెంకటేశ్ తన కుటుంబసభ్యులతో బయటకు వస్తారు.

English Title
Marriage bells rining at Venkatesh home
Related News