విజయ్ దేవరకొండతో మారుతి మూవీ

Updated By ManamWed, 09/05/2018 - 12:29
Vijay Devarakonda, Maruti

Vijay Devarakonda, Maruti‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ ఇలా వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ హీరోతో సినిమాలను తెరకెక్కించేందుకు ఇటు కొత్త దర్శకులతో పాటు అటు పేరు మోసిన దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుతి కూడా విజయ్ దేవరకొండ కోసం ఓ కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథకు కూడా విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
Maruti to direct Vijay Devarakonda
Related News