మేరీకోమ్‌కు నంబర్ వన్ ర్యాంక్

Mary kom
  •  ఏఐబీఏ ర్యాంకింగ్స్

న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ప్రపంచ నంబర్ వన్ బాక్సర్‌గా నిలిచింది. గురువారం విడుదలైన ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో ఆమెకు అగ్రస్థానం లభించింది. మణిపుర్‌కు చెందిన ఈమె వరల్డ్ చాంపియన్‌షిప్స్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా నిలిచింది. ఏఐబీఏ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మేరీకోమ్ 1700 పాయింట్లతో 48 కిలోల కేటగిరిలో అగ్రస్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె 51 కిలోలకు మారనుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో 48 కిలోల కేటగిరి లేదు. ముగ్గురు పిల్లల తల్లి మేరీ కోమ్ 2018ని పూర్తిగా ఎంజాయ్ చేసింది. పోలండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె స్వర్ణ పతకం గెలిచింది. బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరిల్ టోర్నీలో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. భారత ఇతర బాక్సర్లలో పింకి జంగ్ర 51 కిలోల కేటగిరిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచ మాజీ రజత పతక విజేత సోనియా లాథర్ గతేడాది నిరుత్సాహ పరచినప్పటికీ 57 కిలోల కేటగిరిలో రెండో ర్యాంక్ సాధించింది. ఆసియా గేమ్స్‌లో ఆమె ఒక్క పతకం కూడా గెలవలేదు. ప్రపంచ కాంస్య పతక విజేత సిమ్రన్‌జిత్ కౌర్ 54 కిలోల కేటగిరిలో నాలుగో స్థానంలో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఈమె జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రపంచ మాజీ చాంపియన్ ఎల్ సరితా దేవి 16వ ర్యాంక్ సాధించింది. ఇండియా ఓపెన్ పసిడి పతక విజేత, ప్రపంచ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్బొహైన్ 69 కిలోల కేటగిరిలో ఐదో స్థానం సంపాదించింది. పురుషుల ర్యాంకింగ్స్‌ను ఇంకా అప్‌డేట్ చేయలేదు.

Tags

సంబంధిత వార్తలు