ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

Updated By ManamSat, 06/09/2018 - 10:00
Massive fire breaks out inside Patel Chambers in Mumbai's Fort area

Massive fire breaks out inside Patel Chambers in Mumbai's Fort area

ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ముంబై ఫోర్ట్‌ ఏరియాలోని పటేల్‌ ఛాంబర్స్‌లోని ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కలున్న స్థానికులు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది 18 ఫైరింజన్లతో మంటలార్పుతోంది. ఈ మంటల థాటికి భవనం కుప్పకూలిపోయినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాణ నష్టం ఎంత మేర జరిగిందనే విషయం తెలియరాలేదు. ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది..? గ్యాస్ సిలిండర్ పేలిందా..? లేదా షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందా..? అనే విషయం తెలియరాలేదు.

మంటలను ఆర్పుతున్న ఇద్దరు ఫైరింగ్ సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 11 నీళ్ల ట్యాంక్‌లతో 150మంది ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని ఫైరింగ్ కీకల అధికారి ఒకరు మీడియాకు వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

 

English Title
Massive fire breaks out inside Patel Chambers in Mumbai's Fort area
Related News