సమస్యలకు ఎదురొడ్డడమే జీవితం

Updated By ManamMon, 09/10/2018 - 00:53
mathanam

imageప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, ప్రతి 40 సెకనులకు ఒక్కరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఇండియాలో 1,31,666 ఆత్మహత్యలు తెలుగు  రాష్ట్రాలలో  13 వేలపై చిలుకు ఆత్మహత్య లు చేసుకొంటున్నారని, దాదాపుగా రెండు దశా బ్దాల నుంచి ఆత్మహత్యల రేటు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశం. ఆత్మ హత్యకు ప్రయత్నిస్తున్న వారిలో 40 సంవత్సరాల లోపు 80% మంది, ప్రతి 20 మందిలో ఒకరు చనిపోతున్నారని, విషం ద్వారా 36.6% మంది, ఉరివేసుకోవడం ద్వారా 32.1%, ఇతర మార్గాల ద్వారా 7.9% మంది, నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుచున్నప్పటికి యువత, ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి.

మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీత మైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారాసూ సైడ్ అంటారు. తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాము. ఆత్మహత్య చేసుకోవా లనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధుల విభాగంలో అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అంశాలు.

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయా లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురి గొల్పబడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగల్చడం భావ్యం కాదు. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్కక్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కా రం కళ్లముందు కనిపిస్తుంది.

ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్సన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి సంవత్సరం ఒక ప్రధాన ఉద్దేశంతో ఆత్మహత్యల నివారణ రోజుగా సెప్టెంబర్ 10ని నిర్వహిస్తున్నది. ‘కలసి పనిచేద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం’ అనే లక్ష్యంతో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్సన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సామాజిక చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమా లను ప్రపంచ వ్యాప్తంగా చేపట్టడానికి పిలుపు నిచ్చింది.

ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ప్రధానంగా మారుతున్న కాలానుగుణంగా మారలేకపోవడం, తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదుర య్యే సంఘటనలు ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ప్రతిదానికి ఇతరులతో తమనుతాము పోల్చుకుని ఆత్మన్యూనతతో భావనలను కలిగిఉండడం, ఎప్పుడో  జరి గిపోయిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, కొన్ని సంఘటనలు జరుగుతాయని భావించి అనవసర మైన విషయాలను  ఊహించుకుని భయపడడం, సామా జిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుం టాయి. ఆత్మహత్యలకు పాల్పడు వారిలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ఆర్థిక నష్టం భరించలేక, ఉద్యో గం సాధించటంలో వైఫల్యం పొందినవారు, భౌతిక, లైంగిక వేధింపులకు గురికావడం, కుటుంబ సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్తాయికోసం శక్తికి మించి పనులు చేయడం, వృద్ధాప్యంలో నిరాదరణకు గురికావడం, ప్రేమ లో వైఫల్యం పొందడం,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు తూ, మానసిక వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించినవారు, సమాజంలో పరువుపోతుందన్న భయం తో బాధపడుతున్నవారు, చదువులో వెనుకబడినవారు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చ లేకపోతున్నామనుకునే వారు, మత్తుమందులు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి న వారు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు, కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగా వివాహేతర సంబం ధాలున్నవారు, దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక  అనుమానించుకునే వారు, లక్ష్యనిర్దేశనలో వైఫల్యం ఇలా ప లు కారణాలు ఉన్నాయి.

సంవత్సరానికి 800,000 మంది ఆత్మహత్యలు చేసు కోవడం ద్వారా చనిపోతున్నారు. ప్రతి 40 సెకన్లకు ఒక్కరు ఆత్మహత్యకు గురవుతున్నారు. ప్రపంచ ఆత్మహత్య రేటు 100,000 జనాభాకు 11.4. పురుషులకు 15.0 / 100 000. మహిళలకు 8.0 / 100 000. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య రేటు స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. 25 దేశాల్లో (గిఏై సభ్యదేశాల్లో) ఆత్మహత్య చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఆత్మహత్య ద్వారా చనిపోయే ప్రజలలో డిప్రెషన్ అత్యంత సాధారణ మానసిక రుగ్మత యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఆత్మహత్య నివారణ అనేది ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక సవాలుగా మారింది. ప్రతి సంవ త్సరం చనిపోయే వ్యక్తులలో ఆత్మహత్య అనేది మొదటి  15 ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రతి ఒక ఆత్మహత్య ద్వారా చనిపోయే వారితో  సుమారుగా 135 మందిపై ఈ మర ణం తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సంవత్సరంలో  108 మిలియన్ల మంది ప్రజలు ఆత్మహత్య ప్రవర్తనలతో తీవ్రంగా ప్రభావి తమవుతున్నారు. ప్రతి ఒక  ఆత్మహత్య ప్రభావితం చెందిన 25 మంది ఆత్మహత్య చేసుకుంటున్నా రు. చాలామందిలో  ఆత్మహత్య గురించిన  ఆలోచనలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందుగా వీరిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరితనానికి  ఇష్ట పడటం, మద్యం అతిగా సేవించటం, ప్రతీకారం తీర్చుకో వడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తి డిని ప్రదర్శించడం, అతిగా నిద్రపోవడం, రాత్రి సమయం లో నిద్రపోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధా న్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నానని ముందుగానే పరో క్షంగా సంకేతాలివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబసభ్యులు పరిశీ లించి సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ద్వారా కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచ లను నివారించవచ్చును.

చిన్న రంధ్రం కూడా పెద్ద నీళ్ల ట్యాంకును ఖాళీ చెయ్య గలదన్నట్లు చిన్నచిన్న మానసిక రుగ్మతలు కూడా మనిషి జీవితాన్ని మద్యలోనే చాలించేలా చేస్తాయి. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దా నికి కావాల్సింది ఒక్కటే ధైర్యమే. ఓ పదవ తరగతి చదివే విద్యార్థి పదవతరగతి ఫెయిలయ్యానని ఆత్మహత్యకు పాల్ప డితే ఒక్కగానొక్క కొడుకు మరణంతో అతని తల్లిదండ్రులు చిక్కి శల్యమై జీవచ్చవాలుగా మారారు. ఓ రైతు సాగుచేసి పంట చేతికందే సమయానికి వర్షాలతో పంట నష్టం జరిగి, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే అతని పై ఆధార పడిన కుటుంబం వీధిపాలయింది. 

ఆత్మహత్యకు పాల్పడే చర్యలను గుర్తించినపుడు వారి కోసం ప్రత్యేక మైన చర్యలు తీసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంను కల్పించడం. చావు ద్వారానే సమస్యకు పరిష్కారం రాదు అనే విషయాన్ని గుర్తంపచేయాలి.  జీవిత విలువలను గుర్తింపచేసేవిధంగా ప్రేరణ కల్పించాలి.అభయ హస్తం అందించాలి. ఒంటరిగా ఉండకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణను కొనసాగించేలా చర్యలు ఉండాలి. సైకాలజిస్ట్ ను కూడా స్నెహితులు గా గుర్తించి తగు సలహాలు సూచనలు తీసుకొనేవిధంగా ప్రోత్సహించాలి.

- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి 
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, 9703935321
(నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం)

Tags
English Title
mathanam
Related News