కాంగ్రెస్‌కు మాయావతి క్లారిటీ..

Updated By ManamTue, 07/24/2018 - 17:45
mayawati-sonia
  • బంధాన్ని నిలిపేది సీట్ల పంపకమే!

  • కాంగ్రెస్‌కు తేల్చిచెప్పిన మాయావతి

mayawati-sonia

లఖ్‌నవూ: కూటమితో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి కలిగే ప్రయోజనమే కాంగ్రెస్‌కు కలుగుతుందని ఆ పార్టీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ఉమ్మడిగా వెళ్లాలని ఇరు పార్టీల నేతలూ యోచిస్తుండగా.. బీఎస్పీకి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇస్తే తప్ప జట్టు కట్టేది లేదని ఆమె తేల్చిచెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని కాంగ్రెస్, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. అయితే, పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు పలు రూపాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పొత్తుతో బీఎస్పీకి భారీగా ప్రయోజనం చేకూరనుండగా.. దీర్ఘకాలంలో కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన మాయావతి.. పొత్తుతో మాకెంత ప్రయోజనమో కాంగ్రెస్‌కూ అదే స్థాయిలో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్న పార్టీ నేతలకు గతంలోనే ఓ హెచ్చరిక జారీ చేసిన మాయావతి తాజాగా కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు చేశారు. పొత్తుతో ఇరు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో తగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఉమ్మడి బంధం నిలవదంటూ హెచ్చరించారు. మొత్తానికి బంధాన్ని నిలిపేది సీట్ల సంఖ్యేనని తేల్చిచెప్పారు.

English Title
Mayawati open to alliance with Congress
Related News