వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంపు..

Updated By ManamSat, 09/01/2018 - 19:45
Medical students, Stipend hike, Telangana govt, TRS govt, CM KCR

Medical students, Stipend hike, Telangana govt, TRS govt, CM KCRహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలు రంగాలకు తీపి కబురు అందించింది. వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించింది.

పెంచిన స్టైఫండ్ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ స్కీమ్, ప్రమోషన్లు కల్పించిన కేసీఆర్ సర్కార్.. రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా ఏడాదికి 5వరకు ప్రత్యేక సాధారణ సెలవులు, 180 రోజుల పాటు  ప్రసూతి సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

English Title
Medical students Stipend hiked by Telangana govt
Related News